Piling letters to up cm akhilesh yadav add to babus woes

Uttar Pradesh CM Akhilesh Yadav, Piling letters to UP CM Akhilesh Yadav, Piling Letters To Up Cm Add To Babus Woes n

Piling letters to UP CM Akhilesh Yadav add to babus woes: Mukhyamantriji, aap bahut sundar lagte hain, humse shadi karoge ( Dear chief minister, you are handsome. Will you marry me?) Mukhyamantriji, mere paas Bolero gaadi nahin hai. Kya aap de doge?" (I do no't have a Bolero car. Can you get me one?) Akhilesh-bhaiyya, aap ko main bhai maanti hoon. Kya aapko main rakhi baandh sakti hoon? (I consider you my brother. Can I tie rakhi on you?)

అందంగా ఉన్న సీఎం గారు నన్ను పెళ్లి చేసుకుంటారా?

Posted: 07/31/2014 01:42 PM IST
Piling letters to up cm akhilesh yadav add to babus woes

ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడవయ్యా అని ముఖ్యమంత్రిని చేస్తే..! ఆయన వెళ్లిన ప్రతి చోట పెళ్లి కానీ అమ్మాయిలు ముఖ్యమంత్రి వెంటబడి పెళ్లి చేసుకోమని గోల చేస్తున్నారు. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరు కాదు.!! రేపులకు నిలయం, మహిళలకు రక్షణ లేని ఆలయం అయినా.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.

ఇటీవల ఆయన ప్రజల కోసం ‘‘జనతా దర్భార్ ’’ అంటూ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అఖిలేశ్ యాదవ్ ప్రజల కోసం 'జనతా దర్బార్', 'లెటర్స్ టు సీఎం' కార్యక్రమాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎవరైనా సహాయం అవసరమైన వాళ్ళు ఆ దర్బార్ కు గానీ, తనకు గానీ లేఖ రాస్తే సత్వరమే సాయం అందించాలన్నది అఖిలేశ్ ఆలోచన. కానీ, విన్నపాల కంటే పొగడ్తలతో కూడిన లేఖలే అధికంగా వస్తున్నాయట. అదీ కూడా అఖిలేశ్ అందాన్ని కీర్తిస్తూ..! గడచిన రెండేళ్ళలో ఐదు లక్షల ఉత్తరాలు రాగా... అత్యధిక లేఖల సారాంశం "ముఖ్యమంత్రి గారూ మీరెంతో అందంగా ఉన్నారు, మమ్మల్ని పెళ్ళి చేసుకోరూ..!"అనేనట.

కొన్ని లేఖల్లో... "నాకు బొలెరో వాహనం లేదు, నాకోటి కొనిస్తారా..?" అని, మరికొన్ని లేఖల్లో... "మీరు నాకు సోదరుడిలాంటి వారు, రాఖీ కట్టవచ్చా?" అని ఉందట. ఇలాంటి లేఖలతో సదరు కార్యక్రమాల ప్రయోజనం దెబ్బతింటోందని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది వాపోతున్నారు. ముఖ్యమంత్రి భార్య మాత్రం ఆందోళన చెందుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles