Somalia woman killed for not wearing veil

Somalia woman without veil killed, Woaman refused to wear veil killed, Al Shabab Group kills Somalia woman, Somalia woman not wearing veil shot down

Somalia woman killed for not wearing veil: Al Shabab militants kill woman refused to wear a veil

బురఖా వేసుకోనందుకు కాల్చి చంపారు!

Posted: 07/31/2014 11:22 AM IST
Somalia woman killed for not wearing veil

సోమాలియాలో అల్ షబాబా గ్రూప్ మిలిటెంట్లు వేసిన శిక్ష ఇది! 

దక్షిణ సోమాలియాలోని హౌసింగౌ పట్టణంలో రఖ్వియా ఫరా యారౌ అనే మహిళను ఆమె ఇంటి బయట గన్ తో కాల్చి చంపారు మిలిటెంట్లు.  వాళ్ళు అక్కడినుండి పోతున్నప్పుడు ఆమెను చూసి బురఖా వేసుకోమని హెచ్చిరించిపోయారు.  తిరిగి వచ్చేటప్పటికి ఆమె ఇంకా అక్కడే బురఖా లేకుండా ఉండేటప్పటికి ఆగ్రహించిన మిలిటెంట్లు ఆమెను గురి చేసి రెండు రౌండ్లు కాల్చారు.  దానితో ఆమె అక్కడికక్కడే మరణించింది.  ఆమె నివసిస్తున్నప్రాంతం పూర్తిగా అల్ షబాబ్ నియంత్రణలో లేదు కూడా.  

అల్ షబాబ్ గ్రూప్ మాత్రం తామా పనిచెయ్యలేదని చెప్తోంది!

నిందితులను గుర్తించటానికి భయపడుతున్న కుటుంబ సభ్యులు హత్య 7.30 ప్రాంతంలో జరిగిందని మాత్రం చెప్తున్నారు.  మరణించిన యారౌ కి భర్త, పిల్లలు ఉన్నారు.  సెంట్రల్, సౌత్ సోమాలియాలో అధిక భాగాన్ని నియంత్రించే అల్ షబాబా గ్రూప్ అక్కడ నివసించేవారి ప్రవర్తనావళి మీద ఎన్నో ఆంక్షలు విధించారు.  అందులో వేసుకునే దుస్తులు కూడా ఉన్నాయి.  

బిబిసి కి చెందిన విశ్లేషకులు ఈ ఘటన మీద అల్ షబాబ్ తమకేమీ తెలియదని చెప్పటానికి కారణం  ఆ గ్రూప్ లోనే విభేదాలున్నాయి, అంతర్యుద్ధం కొనసాగుతోందని అన్నారు.  మరో కారణమేమిటంటే ఈ షూటింగ్ జరిపింది తామేనని ఒప్పుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత రావొచ్చునన్న భయం.  సాయుధ ఉద్యమకారులు మూకుమ్మిడిగా ప్రజలను భయభ్రాంతులను చేసి నియమాలను కచ్చితంగా పాటించేట్టుగా చేస్తారు కానీ, మనిషి చనిపోయినప్పుడు కలిగే సానుభూతి తో వచ్చే నిరసనలంటే భయపడతారు.  అందుకే వాళ్ళు చేసిన పనిని ఒప్పుకోవటం లేదని  విశ్లేషించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles