Muslim hoteliers ban us products protesting israel attack on gaza

Mumbai Muslim hoteliers ban US products, Israel attacks Gaza, Coca cola products banned, Pepsico products banned

Muslim hoteliers ban US products protesting Israel attack on Gaza

పెప్సీ కోక్ లను నిషేధించిన ముస్లిం హోటళ్ళు!

Posted: 07/26/2014 11:57 AM IST
Muslim hoteliers ban us products protesting israel attack on gaza

ముంబై ముస్లిం హోటళ్ళలో అక్కడ ఏమేం సెర్వ్ చెయ్యటం లేదో తెలియజేస్తూ చేసిన ప్రకటనలో పెప్సీ, కోక్ లున్నాయి.  పెప్సికో, కోకా కోలా, నెస్ల్, క్రాఫ్ట్ ఉత్పాదనలను ఆ హోటళ్ళలో నిషేధించటం జరిగింది.  

భేండీ బజార్ లోని షాలిమార్ హోటల్ నే ఉదాహరణగా తీసుకుంటే, అందులో నిషేధించిన ఉత్పాదనల జాబితాను ప్రదర్శించటమే కాకుండా ముస్లిం జనాభా ఉన్న ఆ ప్రాంతంలో మిగతా వ్యాపారులు కూడా పెప్సీ కోక్ ల అమ్మకాలను నిలిపివేసారు.  

ఇంతకీ అంత ఆగ్రహం ఎందుకంటే ఇజ్రాయల్ గజా లో చేస్తున్న మిలిటరీ ఆపరేషన్ వలన ఎందరో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, మామూలుగా చెప్తే అర్థం కాదు కాబట్టి ఆర్థికంగా దెబ్బ తీస్తే కాని వాళ్ళు లొంగరని హోటల్ వాళ్ళు అంటున్నారు.  అయితే వాళ్ళు నిషేధించిన ఉత్పాదనలకు ఇజ్రాయల్ కి ఏ సంబంధమూ లేదు.  అవన్నీ యుఎస్ కి చెందినవి, ఆ చిన్న ప్రాంతంలో వ్యాపారులు విధించిన నిషేధం వలన ఏమైనా నష్టమంటూ జరిగితే అది అమెరికన్ సంస్థలకు జరుగుతుంది కానీ ఇజ్రాయల్ కి కాదు.

అయితే ముస్లిం వ్యాపారులు అమెరికాకు నష్టం కలిగించాలనుకున్నది ఆ ప్రభుత్వం చూస్తూ ఊరుకున్నందవలనట.  ఇజ్రాయల్ ని నిలువరించకపోయినందువలనట.  

దీనిమీద నెస్ల్ కాని, మోండెలెజ్ ఇంటర్నేషనల్ కాని, పెప్పి కాని ఎటువంటి వ్యాఖ్యానాలు చెయ్యలేదు కానీ కోకాకోలా అధికార ప్రతినిధి మాత్రం, కోకాకోలా స్థానిక వ్యాపారమని, నిషేధాల వలన స్థానిక వ్యాపారులు, నష్టపోతారని, వినియోగదారులు ఇబ్బందిపడతారని అన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles