Female genital mutilation ordered by isis

Female genital mutilation ISIS Order, ISIS fatwa for Iraqi women FGM, FGM of Iraqi women ISIS fatwa

Female genital mutilation ordered by ISIS in Iraq that affects 4 million women

ఇరాక్ లో స్త్రీల మర్మాంగాల విచ్ఛేదనకు ఫత్వా

Posted: 07/25/2014 10:30 AM IST
Female genital mutilation ordered by isis

ఇరాక్ లోని జిహాదీలు 11 నుంచి 46 మధ్య వయసుగల స్త్రీల మర్మాంగాల విచ్ఛేదనకు ఫత్వా (మతపరమైన ఆదేశం) జారీ చేసారు.  

యుద్దం వలన అతలాకుతలమైన ఇరాక్ లో ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు గురువారం నాడు విడుదల చేసిన ఫత్వా ప్రకారం ఇరాక్ లోని నాలుగు మిలియన్ స్త్రీలు ఫిమేల్ జెనిటల్ మ్యుటిలేషన్ (FGM) చేయించుకోవలసివస్తుంది.  పోయిన నెలలోనే ఇరాక్ ని ఆధీనంలోకి తీసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎఐఎస్) ఇస్లాం మతానికి సలాఫిస్ట్ ఆచారంలో అర్థాలు చెప్తూ ఆ ప్రాంతంలో నియమాలను విధిస్తోంది.  అందులో భాగమే FGM కి ఆదేశం.  

ఈ మతపరమైన తంతుని ఇస్లాం మతంలో కఠినమైన ఆచారాలను అనుసరించే 27 దేశాలు పాటిస్తున్నాయి.  స్త్రీలలో పైకి కనిపించే మర్మాంగంలోని సున్నితమైన భాగమైన క్లిటోరిస్ ని, దాన్ని పట్టుకుని దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కత్తిరించి తీసివేయటమౌతుంది.  

మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ప్రాంతాల్లో 125 మిలియన్ స్త్రీలకు FGM జరిగింది.  అందులో మరీ కఠనతరమైన టైప్ III FGM ని చేయించుకున్నవారు 8 మిలియన్ స్త్రీలున్నారు.   ఇది ముఖ్యంగా స్త్రీలలో లైంగికపరమైన కోరికలను తగ్గించటానికి పెట్టుకున్న ఆచారం.  దానివలన వాళ్ళు పవిత్రంగా ఉంటారని నమ్మకం.  

చాలా దేశాల్లో FGM ని నిషేధించినా, దాన్ని అమలుపరచటంలో ఆయా ప్రభుత్వాలు ఎక్కువగా శ్రద్ధ చూపించలేదు.  ఇరాక్ లో ఈ ఆచారం ఎక్కువగా ప్రాచుర్యంలో లేదు.  అందువలన ఐఎస్ఐఎస్ జారీ చేసిన ఈ ఫత్వా వలన 4 మిలియన్ల వరకు స్త్రీల మీద దీని ప్రభావం పడవచ్చని అంచనా.  

ఐఎస్ఐఎస్ హెచ్చరికల మేరకు క్రిస్టియన్స్ ముందే ఇరాక్ ని వదలి వెళ్ళిపోయారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles