3 years kid kicked by teacher

3 years kid kicked by teacher, Teacher kicks 3 year old Kolkata, Teacher kicked 3 year old not traceable

3 years kid kicked by teacher in lake town Kolkata caught in cc camera

3 సం. కుర్రవాడిని ఎగిరితన్నిన టీచరమ్మ

Posted: 07/24/2014 03:19 PM IST
3 years kid kicked by teacher

3 సంవత్సరాల కుర్రవాడిని ప్రైవేట్ టీచర్ ఎగిరి తన్నిన సంఘటన కోల్ కతా లేక్ టైన్ లో వెలుగుచూసింది.  

పిల్లవాడికి చదువు చెప్పటానికి పెట్టుకున్న టీచరమ్మ వాడిని ఎగిరి తన్నేంత తప్పేం చేసాడూ అంటే వాళ్ళమ్మ టీచరమ్మ తప్పుపట్టటటం.  ఊరికే అలా కూర్చుంటే కుదరదమ్మా పిల్లవాడికి పాఠాలు చెప్తేనే పాసవుతాడు అని హెచ్చరించిందామె.  అక్కడేం మాట్లాడకుండా వెళ్ళిపోయిన ఆ టీచర్ పిల్లవాడి గదిలోకి పోయి తలుపులు వేసి వాడిని ఈ కింది వీడియా ఫుటేజ్ లో కనిపిస్తున్నట్లుగా కుంగ్ ఫూ టైప్ లో కిక్ లు ఇచ్చుకుంటూ పోయింది.  

ఆ ఇంట్లో గదుల్లో సిసి కేమెరాలున్నాయని ఆ టీచర్ కి తెలియదు.  పిల్లవాడి ఏడుపు విన్న తల్లి సిసి కేమెరాలో చూస్తే ఏముంది గుండె ఆగిపోయినంత పనైందామెకు.  తలుపులు దబదబా కొట్టినా వెంటనే తియ్యలేదా టీచర్.  రుసరుసా వెళ్ళిపోయిన టీచర్ కి మద్దతుగా ఆమె భర్త, ఇంకా కొంతమంది వచ్చి పిల్లవాడి తల్లిని బెదిరించి మరీ పోయారట పోలీస్ రిపోర్ట్ గాని ఇస్తే జాగ్రత్త బిడ్డా అని.

అయితే పోలీస్ రిపోర్ట్ ఇచ్చేసరికి టీచరమ్మ కనపడకుండా పోయింది.  ఆమె కోసం గాలిస్తున్నాం, పట్టుకుని తీరుతాం అంటున్నారు పోలీసులు.  ఆమె మొబైల్ నంబర్ నుంచి ట్రేస్ చేస్తున్నామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు లే టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ అశోక్ సేన్.

అబ్బాయి షాక్ లో ఉన్నాడు.  ఎవరు దగ్గరికి పోయినా కెవ్వుమని అరేచస్తున్నాడు.  మంచి హాస్పిటల్ లో సిటి స్కాన్ చేస్తే కాని ఆ చిన్నారికి తగిలిన దెబ్బల వలన ఎంత నష్టం జరిగిందో తెలియదంటున్న ఆ అబ్బాయి తండ్రి ఆమె దొరకగానే పోలీసులు ఆమెకు పెద్ద శిక్ష పడేట్టు చెయ్యాలని, అలా జరగని పక్షంలో కుటుంబమంతా నిరాహార దీక్షలో పోలీస్ స్టేషన్ ఎదురుగా కూర్చుంటామని అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles