Ram charan teja forays into airlines industry

Chiranjeevi's Mega Airlines, Ram charan teja Airlines, Turbo Mega,

Mega star Chranjeevi son Ram Charan Teja to operate Turbo Mega Airlines

రాం చరణ్ తేజ MEGA AIRLINES!

Posted: 07/23/2014 08:10 AM IST
Ram charan teja forays into airlines industry

ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ ఎయిర్ లైన్స్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. Turbo Mega అనే పేరుతో ఆయన ప్రాంతీయ రీజనల్ ఎయిర్ లైన్స్ సంస్థను స్థాపించాడట. ఈ సంస్థ డైరెక్టర్లుగా రామ్ చరణ్ తేజ, వంకాయలపాటి ఉమేష్ లు వ్యవహరిస్తారట.

హైదరాబాద్ కేంద్రంగా ప్రాంతీయ ఎయిర్ లైన్స్ గగనతలంలోకి అడుగుపెట్టనుంది. ద్వితీయ శ్రేణి పట్టణాలు, ఎంపిక చేసిన రూట్లలోనే టర్బో మెగా ఎయిర్ వేస్ సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాజాగా కేంద్ర విమానయాన శాఖ కొత్తగా ఆరు ఎయిర్ లైన్స్ కు నిరభ్యంతర పత్రాలు (NOC) జారీ చేయగా.. అందులో టర్బో ఎయిర్ వేస్ కూడా ఉంది.

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత నెల రోజుల్లోనే ఆరు కొత్త సంస్థలకు ఎన్వోసీలు ఇచ్చారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఈ దరఖాస్తులకు అశోక్గజపతిరాజు ఆమోదం తెలిపారు. కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఎన్వోసీలు జారీ చేయటంతో ఇక ఈ సంస్థలు ఎయిర్లైన్ లైసెన్స్ కోసం నియంత్రణా సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉంటే డీజీసీఏ ఎయిర్లైన్స్ లెసెన్స్ మంజూరుకు తక్కువలో తక్కువగా మూడు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు.

దేశంలో ఇంత వరకూ విమాన కనెక్టివిటి లేని ప్రాంతాలకు కొత్తగా సర్వీసులను నడపటంతో పాటు పలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా విమానయాన రంగంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చిన ఆరు సంస్థలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ ఎన్వోసీ జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి కొత్త ఎయిర్లైన్స్ ప్రారంభించనున్న టర్బో మెగా ఎయిర్వేస్ లిమిటెడ్లో రామ్చరణ్ తేజ, వంకాయల పాటి ఉమేష్లు 2013 మార్చి 14న డైరెక్టర్లుగా నియమితులయ్యారు.

Actor Ramcharan Tej, son of Mega Star K. Chiranjeevi is entering into the aviation business with a company called Turbo Megha Airways Private Limited. The company is said to be a subsidiary of Turbo Aviation that has been into aircraft maintenance and ground-handling services since 2003. The Ministry of Civil Aviation issued No-Objection Certificate for Turbo Megha Airways along with two other companies on Monday.

Turbo Megha, which also operates charter flights out of Hyderabad, is expected to be based in the same city. Turbo Megha currently has two active directors/partners including Vankayalapati Umesh and Ram Charan Tej Konidala.

"He has been interested in this business for a while and the company was floated. Very soon, once we get our aircraft, we will announce our schedules between seven cities across India," Mr.Umesh explained.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Medical tests on mim mla akbaruddin at gandhi hospital
Seven americans killed in helicopter crash in peru  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles