Air india and jet airways went over malaysian plane crashed place

Air India and Jet Airways went over Malaysian plane crashed area, Indian planes over Ukraine disturbed area, Malaysian place downed at Ukraine border

Air India and Jet Airways went over Malaysian plane crashed area

భారత విమానాలు ఉక్రైన్ మీదుగా వెళ్ళాయా?

Posted: 07/21/2014 08:47 PM IST
Air india and jet airways went over malaysian plane crashed place

ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ లైన్ విమానాలు ఉక్రైన్ రష్యా సరిహద్దుల్లో కూలిపోయిన విమానం మార్గంలోనే పయనించాయా అని అడిగితే అబ్బే అలాంటిదేమీ లేదు.  ఆ సరిహద్దుల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారటంతో అటువైపు గా వెళ్ళటం లేదని ఆ రెండు విమాన సంస్థలూ శుక్రవారం నాడు ప్రకటించాయి.  మా ప్రయాణీకుల భద్రతే మాకు ప్రధానమంటూ చెప్పుకొచ్చాయి.  

అయితే అదంతా శుద్ధ అబద్ధమంటున్నాడొక విమానయానంలో ఆసక్తిగల దేవేశ్ అగర్వాల్.  మలేషియన్ విమానాన్ని కూల్చివేయటానికి సరిగ్గా రెండు గంటల ముందే జెట్ ఎయిర్ వేస్ అదే మార్గం గుండా పోయిందని అంటున్నాడతను. అందుకు ఆధారంగా అతను శాటిలైట్ ద్వారా విమానాన్ని ట్రాక్ చేసే ఫ్లైట్ ఎవేర్, ప్లేన్ ఫైండర్, ఫ్లైట్ రాడార్ 24 లాంటి వెబ్ సైట్లను స్కాన్ చేసి జెట్ ఎయిర్ వేస్ చెప్పేది తప్పని నిరూపించాడు.  

విమానంలోని ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్ ఎప్పటికప్పుడు జిపిఎస్ ద్వారా ఎయిర్ క్రాఫ్ట్ పొజిషన్ ని పంపిస్తుంటుంది.  వాటి ఆధారంగానే ఆ వెబ్ సైట్లు విమానాల వివరాలను తెలియజేయగలుగుతాయి.  ఆ వివరాల ప్రకారం, జెట్ ఎయిర్ వేస్ ఫ్లైట్ 9 డబ్ల్యు 119 జూలై 17 న లండన్ విమానాశ్రయం నుంచి ముంబైకి ఉదయం 8.39 కి బయలుదేరి అదే ఎయిర్ కారిడార్ లో మలేషియన్ విమానం కూలిన షక్తార్స్క్ గ్రామం మీదుగా ప్రయాణం చేసింది.  

ఫ్లైట్ పాత్ వెబ్ సైట్ నుంచి వివరాలను సంగ్రహించిన ఒక బ్లాగ్ లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 113 మలేషియా విమానం కూలిన ప్రదేశానికి కేవలం 25 కిలోమీటర్ల దూరం లో ఉందని తెలియజేసింది.  32000 అడుగుల ఎత్తున వెళ్ళటంలో తప్పులేదు నిజానికి కానీ అలాగని నేను ఆ విమాన సంస్థలకు మద్దతు పలకటం లేదని కూడా ఆ బ్లాగర్ అన్నారు.  

జెట్ ఎయిర్ వేస్ అధికార ప్రతినిధి మాత్రం సంస్థ ఎటువంటి తప్పు ప్రకటనలూ చెయ్యలేదని అంటున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles