Husband gets alimony from wife as a rare case

Husband gets alimony from wife as a rare case, Gandhinagar family court orders alimony to husband, Sachin Tendulkar's friend gets alimony from his wife

Husband gets alimony from wife as a rare case in the judgement given by Gandhinagar family court

భర్తకే భార్య నుంచి భరణం

Posted: 07/20/2014 10:28 AM IST
Husband gets alimony from wife as a rare case

విడాకులు తీసుకున్న తర్వాత భర్త భార్యకు భరణం చెల్లించమనటం ఇంతవరకు చూసాం కానీ, భర్తకు భరణం చెల్లించవలసిందిగా కోర్టు భార్యను ఆదేశించటమనే అరుదైన న్యాయ పరిష్కారం గాంధీనగర్ లో జరిగింది.  

కేసు వివరాలలోకి పోతే, సచిన్ టెండూల్కర్ తో కలిసి అండర్ 17 లెవెల్ క్రికెట్ ఆడిన దల్బీర్ సింగ్ కి 2002 లో రోడ్ ప్రమాదం జరిగి ఆపరేషన్ చెయ్యవలసివస్తే అందుకైన ఖర్చును సచిన్ టెండూల్కరే భరించారు.  ఆ తర్వాత కోలుకున్న దల్బీర్ సింగ్ రజ్వీందర్ కౌర్ ని వివాహమాడారు.  కానీ అప్పటి నుంచి దల్బీర్ సింగ్ కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి.  

తనని శారీరకంగాను, మానసికంగాను తన భార్య వేధించినట్లుగా దల్బీర్ సింగ్ కోర్టులో ఫిర్యాదు చేసారు.  తనని పూర్తిగా ఇంట్లో బందీగా చేసిందని, కనీసం ఇంట్లో నడవటానికి క్రెచ్ లను కూడా ఉపయోగించనివ్వలేదని అతను కోర్టుకి తెలియజేసాడు.  వాళ్ళు నివసించే ఇంటి పక్కనే ఉంటున్న పోలీస్ అధికారి కమలేష్ త్రివేది ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం దల్బీర్ సింగ్ ని ఇంట్లో తాళ్ళతో కట్టేసి, బయట తాళం వేయటం, విపరీతమైన వేధింపులకు  గురిచెయ్యటం చేసేదట.  ఈ వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్న గాంధీ నగర్ ఫ్యామిలీ కోర్ట్ వాళ్ళిద్దరికీ విడాకులు మంజూరుచేస్తూ భార్య రజ్వీందర్ కౌర్ దల్బీర్ సింగ్ కి ప్రతినెలా రూ.10000 చొప్పున్ అతని మెయింటెనెన్స్ కోసం భరణం చెల్లించాలని ఆదేశించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles