High court judge comments on election promises

High Court Judge comments on election promises, High Court Judge talks about election promises, Judge says unpractical assurances of politicians is cheating public

High Court Judge comments on election promises by political leaders knowing well that cannot be fulfilled

నెరవేర్చలేని హామీలు మోసంతో సమానం- హైకోర్ట్ జడ్జ్

Posted: 07/18/2014 10:36 AM IST
High court judge comments on election promises

అనంతపురంలో నిర్వహించిన అవగహన కార్యక్రమంలో, నైతిక విలువలు-విద్యార్థుల బాధ్యతలు అన్న అంశం మీద మాట్లాడిన హైకోర్ట్ జడ్జ్ చంద్రకుమార్ రాజకీయనాయకులు చేసే హామీల గురించి వ్యాఖ్యానిస్తూ, నెరవేర్చలేమని తెలిసిన హామీలను ఎందుకు చెయ్యాలని ప్రశ్నించారు.

పర్యవసానమేమిటో తెలియకుండా, నెరవేర్చలేమని తెలిసిన హామీలను కూడా ప్రజలకిచ్చి అది వారిని మోసం చేసినట్లవుతుందని ఆయన అన్నారు.  ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాభీష్టం మేరకు పనిచెయ్యటం అవసరమని, అలా చెయ్యకపోతేనే ఉద్యమాలు పుట్టుకొస్తాయని, అలాంటి సందర్భాల్లోనే భగత్ సింగ్ వారసులుగా యువత ముందుకు రావాలని జడ్జ్ అన్నారు.  

అయితే నిర్దుష్టంగా ఏ పార్టీ, ఏ నాయకుడు, ఏ ప్రాంతంలో హామీలు ఇచ్చి, ఎన్నికైన తర్వాత నెరవేర్చలేకుపోతున్నారన్నది ఆయన స్పష్టంగా చెప్పలేదు.  అంతేకాదు అటువంటివాటిని అరికట్టటమెలా అన్నదానిలో సలహాలను కూడా ఆయన సూచించలేదు. కానీ ప్రస్తుత రాజకీయాలలో హామీలు ఇచ్చేటప్పుడు రాజకీయనాయకులు అవి నెరవేర్చగలిగేవా కాదా అన్నది కూడా చూడకుండా, ఇచ్చిన హామీల పర్యవసాన ఎలా ఉంటుందో ఆలోచించకుండా చేస్తున్నారని, అది ప్రజలను మోసం చెయ్యటమే అవుతుందని మాత్రమే జనరల్ గా ఎవరు పేరు ఎత్తకుండా చెప్పుకొచ్చారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles