Nandi awards in divided states

nandi awards in divided states, nandi awards in ap and telangana, nandi awards question in state division backdrop, nandi awards 2014 undecided

Nandi Awards 2014 in the divided states of AP and Telangana

తెలుగు నంది లేక తెలంగాణా నంది?

Posted: 07/17/2014 05:57 PM IST
Nandi awards in divided states

తెలంగాణాలో మాట్లాడేది కూడా తెలుగు భాషే కాబట్టి తెలుగు నంది ఉత్సవాలా, తెలంగాణా నంది ఉత్సవాలా అన్నదానిలో అర్థం లేదు నిజానికి కానీ, తెలుగు తల్లి విగ్రహానికి బదులుగా తెలంగాణాలో తెలంగాణా తల్లి విగ్రహం పెట్టుకున్నందు వలనే ఇలా తెలుగు, తెలంగాణాలను విడిగా చూడటం జరిగింది.  తెలుగు దేశం పార్టీ ప్రాంతీయంగా విడిపోయినా, తెలంగాణా టిడిపి అంటున్నారు కానీ దాన్ని తెలంగాణా దేశం అనటం లేదు కాబట్టి తెలుగు వేరు, తెలంగాణం వేరైపోయాయి (వ్యవహారికంలో).  

ఇక చిత్ర రంగం కూడా ఆంధ్రా తెలంగాణాలుగా చీలిపోయిన తర్వాత నంది అవార్డ్ ల ఫంక్షన్ ని ఎవరు నిర్వహిస్తారు, ఎక్కడ నిర్వహిస్తారన్న ప్రశ్న ఉదయిస్తోంది.  లేదా మొన్న ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లాగా చెన్నై వెళ్ళాల్సివస్తుందా?  చెన్నై నుంచి వచ్చిన సినీ పరిశ్రమ మళ్ళీ చెన్నై వెళ్ళిపోతుందా అన్న సందేహం కూడా చాలా చోట్ల వినిపిస్తోంది.  కళాకారులకు ఎల్లలుండవు కాబట్టి సినీ వేడుకల వేదికను హైద్రాబాద్ నుంచి మార్చివేస్తే ఆ పరిశ్రమలో వేర్పాటు భావం మరింత ఎక్కువౌతుంది.  సినీ పరిశ్రమ హైద్రాబాద్ లోనే ఉంది కాబట్టి హైద్రాబాద్ లోనే జరపటం సరైన విధానం.  కానీ ఏ ప్రభుత్వం జరపాలన్నది ప్రశ్న.  

విద్వేషాలే ఊపిరిగా ముందుకు సాగకుండా ఉమ్మడి రాజధానిలో ఉమ్మడి ప్రభుత్వాలు నంది పురస్కారాల వేడుకను నిర్వహిస్తే అది సినీ కళాకారులకు ఎక్కువ ఆనందాన్నివ్వవచ్చేమో కానీ అది సాధ్యపడేలా కనిపించటం లేదు.  ఎందుకంటే అన్ని రంగాలలో విభజన జరిగిపోయింది కాబట్టి.  అందువలన ఈ సమస్యకు పరిష్కారాన్ని రాజకీయ నాయకులకు కాకుండా కళాకారులే చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తే మంచిదేమో!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles