Rashes inducing metals in ipads lap tops and cell phones

nickel rash from ipad, apple i pad nickel rash, nickel rashes on increase, ipads laptops inducing nickel rash

Ipads, lap tops and other electronic gadgets inducing nickel rashes and scaling on skin

చర్మం మీద దద్దులు- ఐపాడ్, లాప్ టాప్ లతో

Posted: 07/16/2014 05:43 PM IST
Rashes inducing metals in ipads lap tops and cell phones

ఐప్యాడ్, ల్యాప్ టాప్ లను ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు జాగ్రత్త, చర్మవ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ప్రముఖ కంపెనీ ఉత్పాదనల వలన ఏమీ కాదన్న ధీమాతో ఉండకండి.  ఆపిల్ ఐ ప్యాడ్ వాడకంతో చర్మం మీద ఎలర్జీ వచ్చిన ఉదంతం శాన్ డియిగో హాస్పిటల్ లో సోమవారం వెలుగుచూసింది. 

యాపిల్ ఐ ప్యాడ్ వాడుతున్న 11 సంవత్సరాల బాలుడు హాస్పిటల్ లో వైద్య చికిత్స చేయించుకోవలసివచ్చింది.  వైద్యం చేసిన డాక్టర్లు ఆ అబ్బాయి మీద వచ్చిన చర్మపు దద్దులు ఐప్యాడ్ వాడకం వలనేనని తేల్చారు.  

ఐప్యాడ్, కంప్యూటర్లలాంటి వస్తువులలో వాడే నికెల్ ఎలర్జీని కలుగజేసే లోహాలలో ఒకటి.  నికెల్ వలన వచ్చే ఎలర్జీ ప్రాణాంతకమైతే కాదు కానీ చాలా అసౌకర్యం కలిగిస్తుందని డాక్టర్ షారన్ జాకోబ్ అన్నారు.  వైద్య పరీక్షలు, చికిత్స తర్వాత ఆ హాస్పిటల్ లో తయారు చేసిన నివేదికను తయారుచెయ్యటంలో డాక్టర్ జాకోబ్ కూడా పనిచేసారు.  మామూలుగా అలర్జీలలో దద్దులు లేచి చర్మం ఊడిపోవటం జరుగుతుంది.  కానీ ఆ అబ్బాయికి శరీరమంతా వచ్చిన అలర్జీ చాలా తేడాగా కనిపించింది.  వైద్య పరీక్షల్లో అది నికెల్ అలర్జీ అని తేలింది.  అది ఎక్కడి నుంచి సోకిందా అని చూస్తే ఆ అబ్బాయి  2010 నుంచి వాడుతున్న ఐప్యాడ్ నుంచని డాక్టర్లు నిర్ధారణ చేసారు.  

ఐప్యాడ్ ని అబ్బాయి రోజూ వాడేవాడని అతని తల్లి చెప్పింది.  దానికి ఇప్పుడు రక్షక కవర్ ని తొడిగిన తర్వాత అబ్బాయి వ్యాధి నయమవుతోందని కూడా ఆమె తెలియజేసింది.  

నికెల్ అలర్జీలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువయ్యాయని డాక్టర్ జాకొబ్ అన్నారు.  ఈ విషయంలో ఆమె డేటా కూడా చూపిస్తూ పది సంవత్సరాల క్రితం 17 శాతంలో ఉన్న ఎలర్జీ ఇప్పుడు 25 శాతానికి పెరిగిందని చెప్పారు.  

అయితే నికెల్ అలర్జీలు కేవలం ఐప్యాడ్, కంప్యూటర్లతోనే కాదు సెల్ ఫోన్లతోను, ఒక్కోసారి కళ్ళజోడు ఫ్రేం, జిప్ లతో కూడా వచ్చే అవకాశం ఉంది.  నికెల్ అలర్జీ బాగా వచ్చినప్పుడు కొన్ని సందర్బాల్లో యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ కూడా వాడవలసిన అవసరం కలిగిందని కూడా డాక్టర్ జాకొబ్ అన్నారు.

దీనికి పరిష్కారమార్గమేమిటో కూడా శాస్త్రజ్ఞులే చెప్పాలి.  ఎందుకంటే ఈ వస్తువుల వాడకం మన జీవితంలో విడదీయలేనిదైపోయింది.  ప్లాస్టిక్ క్యాన్సర్ కి హేతువని చెప్పారు కానీ దానికి ప్రత్యామ్నాయం లభించలేదు.  ఇంకా ప్లాస్టిక్ వస్తువులను వాడుతూనేవున్నాం.  అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలలోంచి వచ్చే నికెల్ అలర్జీనుంచి కూడా ప్రత్యామ్నాయం దొరికేంత వరకు వాటిని ఉపయోగించక తప్పదు, వాటి ప్రభావానికి బాధపడకా తప్పదు.  

పూర్వకాలం కావిడి మోసేవాళ్ళకి, గుర్రపు స్వారీ చేసేవారికి శరీరం మీద కాయలు కాసేవి.  వాటికి ప్రత్యామ్నాయం దొరికిన తర్వాత ఆ బాధలు తప్పాయి.  అదేవిధంగా నికెల్ అలర్జీని కలిగించే ఎలక్ట్రానిక్ ఇతర సాధనాలకు ప్రత్యామ్నాయం లభిస్తే కాని ఈ అసౌకర్యం తొలగదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles