Botsa warns babu against white papers revelations

botsa satyanarayana on white paper, previous govt faults in babu’s white paper, botsa warns babu about investors going back

Botsa warns Babu against White papers revelations in which previous government’s mistakes are reported

గత ప్రభుత్వాలను ఎండగడితే మీకే నష్టం- సత్తిబాబు సలహా

Posted: 07/16/2014 12:33 PM IST
Botsa warns babu against white papers revelations

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎడాపెడా శ్వేతపత్రాలను విడుదల చేస్తూ వాటిలో ప్రముఖంగా గత ప్రభుత్వ వైఖరి వలన ఒక్కో విషయంలో రాష్ట్రం ఎంత నష్టపోయిందన్నదాన్ని వివరించటాన్ని మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ తప్పు పట్టారు.  

మన రాష్ట్రం గురించి చెప్పుకుంటే మనమే చులకనైపోతాం, వచ్చే పెట్టుబడులు కూడా రావు చూసుకొండి మరి అంటన్నారాయన.  ముఖ్యమంత్రిగా రాష్టానికి తండ్రిగా తల్లిగా అన్నీ కడుపులో పెట్టుకుని దాచుకోవాలి కానీ శ్వేతపత్రాల రూపంలో ఆయా అవకతవకల వివరాలను బయటపడేస్తారా అన్నది ఆయన ఉద్దేశ్యం.  

రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యటంకోసం పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆశిస్తున్న చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలోని తప్పులను గుప్తంగా ఉంచాలని, గుట్టుగా ఉంటేనే పెట్టుబడిదార్లు వస్తారని, లేకుంటే వాళ్ళు వేరే దార్లు వెతుక్కుంటారని బొత్సా నచ్చచెప్తున్నారు.  

గుట్టుగా ఉండటానికి కాంగ్రెస్, తెదేపా కలిసి సంసారమేమీ చెయ్యటం లేదుగా.  కుటుంబంలో కలహాలుంటే బయటి నుంచి ఆర్థిక సాయం చేసేవారు ముందుకు రారన్నది నిజమే.  ఏమో ఎలా ఉంటుందో తీరా వీళ్ళు ఇలా కీచులాడుకుంటూ విడిపోతే మనడబ్బు బుడుంగుమంటుందేమో అని భయపడే అవకాశం ఉంది.  కానీ అవన్నీ గత ప్రభుత్వం గురించి చేస్తున్న ప్రకటనలైనప్పుడు, వాటికి సమాధానం ఒకవేళ ఉంటే వాటిని ముందుకు తీసుకునిరావాలి కానీ, గుట్టు బయటపెడితే మీకే నష్టమంటూ హెచ్చరించటమేమిటని అడుగుతున్నారు తెలుగు తమ్ముళ్ళు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles