Telangana congress in soup again

Telangana Congress in soup again, Polavaram ordinance passed in Rajyasabha, Telangana Rashtra Samithi protesting polavaram project

Telangana Congress in soup again

మరోసారి ఇరుకునపడ్డ తెలంగాణా కాంగ్రెస్!

Posted: 07/15/2014 10:04 AM IST
Telangana congress in soup again

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ ఏదోవిధంగా నలిగిపోతూనేవస్తున్నారు.  అధిష్టానానికి చెప్పలేక, ప్రజలను ఒప్పించలేక, ఇతర పార్టీలను ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర సమితి ఎత్తిపొడుపులకు తట్టుకోలేక తెలంగాణా కాంగ్రెస్ నాయకులు నానా హైరానా పడ్డారు.  ఢిల్లీ పోతే నాయకురాలు ఏమీ చెప్పకపోవటం, వెనక్కి వస్తే ఉత్తి చేతుల్లో ఎలా వస్తారు ప్రజలు మిమ్మల్ని గ్రామాల్లోకి రానివ్వరంటూ తెరాస బెదిరింపులు వీటి మధ్య ఏం చెయ్యాలో తోచక పార్టీలు మారినవారూ ఉన్నారు, రాజీనామాలు చేసినవారూ ఉన్నారు, తమ సొంత పార్టీ మీదనే నిరసన చూపించినవారూ ఉన్నారు.  కానీ ప్రతి సందర్భంలోను తెలంగాణా కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా దిక్కుతోచని పరిస్థితుల్లోనే కొట్టమిట్టాడారు.  

తీరా తెలంగాణా వచ్చినా 2014 ఎన్నికలలో ఘోరపజాయంతో రాష్ట్రంలో కనీసం ప్రతిపక్షంగానైనా ఉన్నామంటూ సంతోషపడుతుంటే, పోలవరం ఆర్డినెన్స్ రాజ్యసభలో కూడా పాసై చట్టరూపం దాల్చింది.  దానితో, అసలే దానిమీద గుర్రుగా ఉన్న తెరాస మరోసారి కాంగ్రెస్ మీద విరుచుకుపడటానికి మళ్ళీ అవకాశం చిక్కింది.

పోలవరం ఆర్డినెన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, భారతీయ జనతా పార్టీ కేవలం దానికి చట్టబద్ధత తీసుకునివచ్చే ప్రయత్నమే చేసిందని భాజపా వాదన తెలంగాణా కాంగ్రెస్ ని మరోసారి ఇరుకునపడేసింది.  కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ మాత్రం స్థానాలు కూడా దక్కించుకోకుండా తెరాస ప్రయత్నం చెయ్యదలచుకుంటే, ఇదో అయాచితంగా దోరికిన అవకాశమే.  పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ వలన తెలంగాణాకి నష్టమని, ముంపు ప్రాంతాలను రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో కలుపుతున్నారని ఆందోళన చేసిన తెరాసకి, ఆ పాపమంతా కాంగ్రెస్ దేనని చెప్పటం, జైరాం రమేశ్ లాంటి నాయకులు అది నిజమేనని ఒప్పుకోవటంతో తెలంగాణా కాంగ్రెస్ మెడకి మరో ఆరోపణ పోలవరం రూపంలో చుట్టుకుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles