Telangana govt does not agree for common policing

Telangana Govt does not agree for common policing, TRS leader Jitender Singh puts down common policing, Governor looking after law and order denied by Telangana, Hate cases in Hyderabad common capital

Telangana Govt does not agree for common policing in Hyderabad and Cyberabad

రాజధాని ఉమ్మడే కావొచ్చుకానీ పోలీసింగ్ మాదే!

Posted: 07/13/2014 12:04 PM IST
Telangana govt does not agree for common policing

హైద్రాబాద్ ఉమ్మడి రాజధానే కావొచ్చు కానీ ఇది మా రాష్ట్రం,  రాష్ట్రంలో పరిరక్షణ మా బాధ్యత అంటోంది తెలంగాణా ప్రభుత్వం.  

హైద్రాబాద్, సైబరాబాద్ లలో శాంతి భద్రతలను పరిరక్షించటానికి అవసరమైన పోలీస్ సిబ్బందిని ఇరు రాష్ట్రాల నుంచి నియమించాలని కేంద్ర హోం శాఖ చేసిన సూచనకు తెలంగాణా ప్రభుత్వం నో అనేసింది.  

ఉమ్మడిరాజధానిగా ఉన్న హైద్రాబాద్ తెలంగాణా రాష్ట్రంలో భాగం.  శాంతి భద్రతలను చూడవలిసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది.  వేరే రాష్ట్రం వాళ్ళకి ఇక్కడ పోలీసింగ్ చెయ్యటానికి అధికారం లేదంటూ తెలంగాణా రాష్ట్ర జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ కేంద్ర హోంశాఖకు జవాబిచ్చారు.

దానికి ముందు పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్న హైద్రాబాద్ లో శాంతిభద్రతలను చూసే బాధ్యతలను గవర్నర్ కి అప్పగించాలన్న ప్రస్తావన రాగా, అది సమంజసం కాదని, అంతలేసి అధికారాలను గవర్నర్ కి కట్టబెట్టటం తెలంగాణా ప్రజల పట్ల అన్యాయం చెయ్యటమే అవుతుందని, అందువలన ఆ ప్రతిపాదనను పునరాలోచన చెయ్యాలని తెలంగాణా ప్రభుత్వం హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి తెలియజేసారు.  దీన్ని ప్రతిఘటించటానికి ఎంతవరకైనా వెళ్తామంటున్నారు తెలంగాణా నాయకులు.  

హైద్రాబాద్ రంగారెడ్డి జిల్లాలలో సీమాంధ్రులను లక్ష్యంగా చేసుకుని వర్గపోరాటాలు సాగుతున్నాయని రిపోర్ట్ లు వచ్చిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ హైద్రాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు తెలంగాణా ఆంధ్ర ఉమ్మడి సిబ్బందితో పనిచెయ్యాలని కేంద్ర హోంశాఖ సూచించింది.  
అయితే సీమాంధ్రుల మీద దౌర్జన్యం జరిగిన ఒక్క ఘటన కూడా లేదని తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు జితేందర్ రెడ్డి వాదించారు.
ఇప్పటికే పోలవరం ఆర్డినెన్స్ మీద ధుమధుమలాడుతున్న తెలంగాణా ప్రభుత్వం హోంమంత్రి ప్రతిపాదనలన్నిటినీ తిప్పికొట్టింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles