Amit shah asks party leaders to defend modi government

Amit Shah asks party leaders to defend Modi Government, BJP President Amit Shah meets party leaders, BJP spokesmen to defend Central Govt Amit shah asks

Amit Shah asks party leaders to defend Modi Government

మద్దతుగా నాలుగు మాటలు మాట్లాడండయ్యా!

Posted: 07/12/2014 11:12 AM IST
Amit shah asks party leaders to defend modi government

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీలోని నాయకులందరికీ పిలుపునిచ్చారు.  పార్టీ పగ్గాలు చేపట్టిన అమిత్ షా తనదైన శైలిలో అందరినీ పనిచెయ్యమని అన్నారు.  రాజకీయంగా వ్యూహరచన చేసి భాజపాకి అఖండమైన మెజార్టీ తెచ్చిపెట్టటంలో అమిత్ షా పాత్ర నరేంద్ర మోదీ కృషికేమీ తీసిపోదని అందరికీ తెలుసు.  

2014 ఎన్నికల ముందు తెరముందు మోదీ తన ప్రసంగాలతో, అలుపులేని పర్యటనలతో ఆకట్టుకుంటే, తెరవెనుక అమిత్ షా పార్టీ బలగాలను ప్రోత్సహించి ముందుకు తోసి మోదీ వ్యాహాలను ప్రత్యక్షరూపంలో అమలు పరచిన ఘనత అమిత్ షా దన్నది లోక విదితమే.

అంత విశ్వాసపాత్రుని పాత్రను వహించిన అమిత్ షాకి అందుకే పార్టీ నాయకత్వం వరించింది.  అయితే తానొక్కడే అలా పనిచేస్తే సరిపోదు కనుక భాజపా లని నాయకులందరినీ పార్టీకి మద్దతుగా మాట్లాడమని ప్రోత్సహిస్తున్నారాయన.  కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలెలాగైతే భాజపా మీద కాని, అధికారం లో ఉన్న ఎన్డియే మీద కాని ఏ కాస్త అవకాశం వచ్చినా ఎలాగైతే విరుచుకుపడుతున్నాయో అలాగే పార్టీలోని నాయకులు కూడా మోదీ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం చాలా అవసరమని అమిత్ షా భావించినట్లున్నారు, అధికార ప్రతినిధులను మీడియా సెల్ సభ్యులతో శుక్రవారం సమావేశమై ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడమని కోరారు.  

అమిత్ షా పార్టీలో కూడా పెను మార్పులు తేబోతున్నారని సమాచారం.  అంతకు ముందు అధికార ప్రతినిధులుగానూ, సీనియర్ నాయకులుగాను తమ వ్యాఖ్యలను వెదజల్లిన నిర్మలా సీతారామన్, రవిశంకర ప్రసాద్, జవదేకర్, ఉమా భారతి, స్మృతి ఇరానీ లాంటివారు పార్టీలో పనిచేసిన దానికి ఫలితంగా ప్రభుత్వంలో హోదాలను పొందారు.  

ఏ సందర్భంలోనైనా మాట్లాడేముందు ఆ విషయంలో పూర్తి అవగాహనతో చెయ్యమని పార్టీ నాయకులకు చెప్పిన అమిత్ షా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడవద్దని పార్టీ నాయకులను హెచ్చిరించారు.  

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరుకునేది కూడా ఇదేనని ఆ ఉద్దేశ్యంతోనే అమిత్ షా కి పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టటానికి పరోక్షంగా ఆయన కృషిచేసారని ముందు నుంచీ అందరూ చెప్పుకుంటున్న మాటలు నిజమేనని అమిత్ షా మాటలు చెప్తున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles