Hyderbad metro works as per old agreement

central government for hyderabad metro old design, hyderbad metro works as per old agreement, kcr objects for hyderabad metro works, center in favor of l & t in hyderabad metro

hyderbad metro works as per old agreement

హైద్రాబాద్ మెట్రో పూర్వ ఒప్పందం ప్రకారమే!

Posted: 07/10/2014 12:36 PM IST
Hyderbad metro works as per old agreement

హైద్రాబాద్ మెట్రో పనులు పూర్వ ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే జరగాలని కేంద్రం తెలంగాణా ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక కార్యదర్శి నుంచి లేఖ అందింది.  

తెలంగాణా రాష్ట్ర ఏర్పడటంతోనే ముందుగా ముఖ్యమంత్రిగా కొత్త రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన కె చంద్రశేఖర రావు హైద్రాబాద్ మెట్రో డిజైన్ మీద అసంతృప్తి వ్యక్తం చేసారు.  చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించటం కోసం మెట్రో పనులు కొన్ని చోట్ల భూగర్భంలోంచి జరగాలని ఆయన ఆదేశించటంతో మెట్రో పనులు చేస్తున్న ఎల్ అండ్ టి అందుకు అభ్యంతరాలు తెలియజేసింది.  ముందుగా అనుకున్న డిజైన్ ప్రకారం పని చేయగలుగుతామని, డిజైన్ మార్చినట్లయితే అదే ఒప్పందం మీద అదే బడ్జెట్ లో పని పూర్తి చెయ్యటం కష్టమౌతుందని ఆ సంస్థ ఖరాఖండిగా చెప్పింది.

అయినా ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టుబట్టటటంతో కొత్త ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనులు పూర్తి చెయ్యటం అసాధ్యమని ఎల్ అండ్ టి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది.  దాని మీద స్పందించిన కేంద్ర ప్రభుత్వం పాత డిజైన్ ప్రకారమే మెట్రో పనులను జరిపించాలని, మార్పులు చేర్పులు చెయ్యటం కుదరని పని అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles