Prakash javadekar indirectly warns to cm kcr

prakash javadekar indirectly warns to cm kcr, prakash javadekar latest news, prakash javadekar news, prakash jawadekar comments on cm kcr, prakash javadekar fires on cm kcr, prakash javadekar fires on kcr, prakash javadekar with cm kcr, tv9 and andhra jyothy news channels stopped

prakash javadekar indirectly warns to cm kcr

కేసీఆర్ కు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత!

Posted: 07/09/2014 02:51 PM IST
Prakash javadekar indirectly warns to cm kcr

(Image source from: prakash javadekar indirectly warns to cm kcr)

తెలంగాణ రాష్ట్రంలో గతకొద్దిరోజుల నుంచి టీవీ9, ఏబీఎన్ న్యూస్ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే! దీనిపై కేంద్రప్రభుత్వం కూడా గతంలో నిలిపేసిన ఛానెళ్లను తిరిగి ప్రసారం చేయాల్సిందిగా చాలాసార్లు విజ్ఞప్తి కూడా చేసింది. ఆయా ఛానెళ్ల యజమానులు, అందులో పనిచేసే సభ్యులు కూడా ఈ నిలిపివేతపై నిరసనలు వ్యక్తం చేస్తూ, ర్యాలీలు నిర్వహిస్తూనే వున్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం వాటిని తిరిగి ప్రసారం చేసేందుకు ససెమిరా అంటూనే వుంది.

ఇప్పుడు తాజాగా ఈ విషయం మీదే చర్చిస్తూ.. కేంద్ర సమాచార ప్రసారశాఖమంత్రి అయిన ప్రకాష్ జవదేకర్ మండిపడ్డారు. గతంలో ఎన్నిసార్లు హెచ్చరికలు జారీచేసినా తెలంగాణ ప్రభుత్వం అందుకు తగినట్లుగా సమాధానం ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినా ఆయన... తీవ్రంగా స్పందించారు. తెలంగాణాలోని ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లకు కేవలం ఒకే ఒక్కరోజు సమయం ఇస్తున్నామని.... ఆలోగా సమస్యను పరిష్కరించుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చిరకలు జారీ చేశారు.

టీఆర్ఎష్ జనరల్ సెక్రటరీ కె.కేశవరావుతో కలిసి మాట్లాడిన జవదేకర్... ఈవిధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చెప్పిన సమయంలోగా అన్ని సమస్యలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన ఆయన... అలాకాని పక్షంలో చట్టరీత్యా వున్న లైసెన్సులను కూడా రద్దు చేయిస్తామని గట్టిగా వాదించారు. ‘‘ఈ వివాదం మీద తెలంగాణ సీఎం కేసీఆర్ కు రెండువారాల క్రితమే లేఖ రాసినా.. అందుకు ఆయన సమాధానం ఇవ్వలేదని’’ ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం తతంగాన్ని బట్టి చూస్తుంటే... జవదేకర్, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు.

గతంలో టీవీ9 న్యూస్ ఛానెల్ వారు నిర్వహించే ఒక పొలిటికల్ సెటైర్ కార్యక్రమంలో తెరాస ఎమ్మెల్యేలను ఎద్దేవా చేస్తూ వ్యంగ్యంగా కామెంట్లు చేసింది. దీంతో టీఆర్ఎస్ మంత్రులు మండిపడ్డారు. అనధికారిక ఆదేశాలు జారీఅవడంతో టీవీ9, ఆంధ్రజ్యోతి ప్రసారాలను తెలంగాణాలో నిలిపిశాయి. అప్పటినుంచి మొదలైన ఈ వివాదం మీద తెలంగాణ ప్రభుత్వం మొండిచేయి చూపుతూనే రావడంతో జవదేకర్ ఇలా కామెంట్లు చేయాల్సి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles