Polavaram bill postpone in lok sabha

polavaram bill postpone in lok sabha, Polavaram Bill postponed, Polavaram Bill, Budget Session.

polavaram bill postpone in lok sabha

పోలవరం బిల్లు ఎలా వాయిదా పడింది?

Posted: 07/08/2014 09:06 AM IST
Polavaram bill postpone in lok sabha

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే అత్యంత కీలకమైన పోలవరం ఆర్డినెన్సు స్థానంలో బిల్లును తీసుకురావాలనుకున్న మోడీ సర్కారు ప్రయత్నం విఫలమయింది. దీనికి సంబంధించి అజెండాలో ఐటెం 6, 7 లుగా పోలవరం అంశాన్ని పేర్కొన్నారు.

అయితే, మధ్యాహ్నం 2 గంటల సమయంలో లోక్ సభలో బిల్లుపై జారీ చేసిన ప్రకటనను చేపట్టరాదంటూ స్పీకర్ ను కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ కోరారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అనుమతి లభించకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (సవరణ) బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది.

రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మళ్లీ సరిహద్దులను మారుస్తుండటం వల్లే రాష్ట్రపతి వైపు నుంచి జాప్యం జరిగింది. రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే బిల్లుకు ఆమోదం తెలపాలని రాష్ట్రపతి ప్రణబ్ భావిస్తున్నారు. దీంతో, లోక్ సభలో బిల్లును ఉపసంహరించుకున్నారు.

అయితే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సాంకేతిక కారణాల వల్లే పోలవరం బిల్లును సభలో ప్రవేశపెట్టలేకపోయామని వివరణ ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం వచ్చిన వెంటనే, ఒకట్రెండు రోజుల్లో పోలవరం అంశాన్ని మళ్లీ అజెండాలో చేర్చి, సభలో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles