Cm chandrababu naidu vs ys jagan

cm chandrababu naidu vs ys jagan, Tdp , ysrcp, seemandhra, andhrapradesh, ap, పురపాలక , కార్పొరేట్, క్యాంప్ రాజకీయాలు, మున్సిపల్, పరిషత్ ఎన్నికలు,

cm chandrababu naidu vs ys jagan

పీఠం ఎవరిది....? నీదా-నాదా? బాబు-జగన్

Posted: 07/03/2014 09:07 AM IST
Cm chandrababu naidu vs ys jagan

రోసారి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపడనున్నారు. అధికారంలో ఉన్న టీడీపి జిల్లాల్లో అత్యధిక పురపాలక, కార్పొరెట్ పీఠాలను దక్కించుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తుంది. అదే బాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా క్యాంప్ రాజకీయాలు జరుపుతు.. పోటా పోటీగా ఢీ కొంటున్నాయి.

ముఖ్యంగా చంద్రబాబుకు తలనొప్పిగా మారిన జిల్లా నెల్లూరు. అక్కడ వైసీపి చాలా బలంగా ఉంది. నెల్లూరు జిల్లాలో నగర కార్పొరేషన్ తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో టీడీపీ, వైసీపీ ల మధ్య పరోక్ష ఎన్నికల పోరు ఉత్కంఠభరితంగానే వుంది. చైర్మన్ గిరీలను దక్కించుకోవాలని ఎవరి బలం వారు నిరూపించుకుంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్ తర్వాత అత్యధిక వార్డులున్న కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీలపై టీడీపీ దృష్టి పెట్టింది. మేయర్ పీఠం వైసీపీనే వరించే అవకాశముంది.కానీ టీడీపీ మాత్రం వైసీపి నేతలకు గాలం వేస్తుంది .

చిత్తూరు జిల్లాలో ఆరు మున్సిపాలిటీల్లో నాలుగు టీడీపీకి, రెండు వైసీపీ ఖాతాలో పడ్డాయి. కార్పొరేషన్ తో పాటు మదనపల్లి మున్సిపాలిటీని టీడీపీ సొంతం చేసుకుంది. దీంతో అక్కడ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠభరితమైన పోరు సాగనుంది.

కర్నూలు జిల్లాలో 8 మున్సిపాలిటీల్లో ఐదు వైసీపీ, మూడు టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. వైసీపీలో గెలిచినా టీడీపీ వైపు కొందరు నేతలు చూస్తుండటంతో... అయోమయం నెలకొంది. మద్దతిస్తే అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో ఏదోఒకటి గ్యారెంటీ కావడంతో... క్యాంపు రాజకీయాలు జోరుగా సాగాయి.

శ్రీకాకుళం జిల్లాలో 4 పురపాలక సంఘాలు, రెండు నగర పంచాయితీలున్నాయి. శ్రీకాకుళం, రాజం మినహా మూడు పురపాలక సంఘాలు, ఒక నగర పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. వీటిల్లో పలాస, పాలకొండ నగరపంచాయతీల్లో టీడీపీ ...ఇచ్ఛాపురంలో వైసీపీ ఆధిక్యం చాటుకుంది. ఆముదాలవలసలో ఎవరికీ ఆధిక్యం లేదు. దీంతో అక్కడ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు వేడెక్కిస్తున్నాయి . అధికార, ప్రతిపక్ష పార్టీలు పీఠం కోసం పావులు కదుపుతున్నాయి.
విజయనగరం జిల్లాలో వున్న జెడ్పీ పీఠం, నాలుగు మున్సిపాలిటీలు , 23 ఎంపీపీలు టీడీపీ ఖాతాలోకి చేరతాయి. బొబ్బిలి మున్సిపాలిటీ కూడా టీడీపీకే దక్కే అవకాశం కనబడుతోంది.

అయితే పీఠాలు దక్కించుకోవటానికి .. చంద్రబాబు, జగన్ రంగంలోకి తెరవెనుక రాజకీయలు చేస్తూ , పీఠాల కోసం కొత్త పాట్లు పడుతున్నారు. అయితే ఆయా పార్టీల నేతలను జారిపోకుండా , జాగ్రత్తగా కాపాడుకుంటూ తెరవెనక రాజకీయలు చేస్తూ, అధిక పీఠాలు దక్కించుకునేందుకు .. పోటా పోటీగా.. క్యాంపు రాజకీయలు చేస్తున్నారు. అయితే చివరకు ఎవరికి ఎన్ని పీఠాలు దక్కుతాయో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles