High court relief to nagarjuna in n convention centre case

high court granted respite to akkineni nagarjuna, high court relief to nagarjuna in n convention centre case, high court granted the relief of status quo, ghmc caution notices at the n-convention centre, justice a rajasheker reddy, n-convention centre

high court relief to nagarjuna in n convention centre case

నాగార్జునకు హైకోర్ట్ నుంచి ఊరట

Posted: 07/01/2014 05:46 PM IST
High court relief to nagarjuna in n convention centre case

ఎన్ కన్వెన్ష్ విషయంలో జిహెచ్ఎమ్ సి దూకుడుకి కళ్ళెం వేస్తూ హైకోర్ట్ స్టేటస్ కో ని ఆదేశించింది.  గ్రేటర్ హైద్రాబాద్, నీటిపారుదల శాఖవారు ఎన్ కన్వెన్షన్ లో చేసిన సర్వేలలో భూకబ్జా కింద అభియోగాన్ని మోపుతూ నోటీసులు అంటించటంతో అంతకు ముందు గురుకుల ట్రస్ట్ లో నోటీసుల్లేకుండా భవనాలను కూల్చిన నేపథ్యంలో అక్కినేని నాగార్జున హైకోర్ట్ ని ఆశ్రయించగా, హైకోర్టు నిర్దేశించిన యథాతథస్థితి వలన ఊరట నాగార్జునకు కలిగింది.  

నాగార్జున వాదన

గురుకుల ట్రస్ట్ అధ్యక్షుడు బి.కిషన్ లాల్ నుంచి కొందరు కొన్న భూముల నుంచి నాగార్జున 27 వేల చదరపు మీటర్లను కొనుగోలు చేసి హుడా అనుమతితో ప్రహరీగోడను నిర్మించారు. చట్టప్రకారం కొనుగోలు చేసిన భూమిలో ఫంక్షన్ హాల్ నిర్మించి, గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన నుంచి దాన్ని నిర్వహించటానికి అనుమతులు తీసుకుని దానిమీద ఆస్తిపన్ను కూడా చెల్లిస్తూ వస్తున్నారు.  క్రమబద్ధీకరణకోసం అధికారులకు పెట్టుకున్న అప్లికేషన్ ని ప్రభుత్వం తిరస్కరించగా దానిమీద నాగార్జున అప్పట్లో హైకోర్ట్ కి వెళ్ళటం జరిగింది.  కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని అప్పుడు కోర్టు ఆదేశించటం కూడా జరిగింది.  

తాజాగా వచ్చిన అధికారులు ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్ లో ఉందని మార్కింగ్ చేసారు.  1992 లోనే చేసిన కొనుగోలు మీద అప్పుడు ఎటువంటి ప్రకటనలు చెయ్యని అధికారులు ఇప్పుడు ఎలా అభ్యంతరాలు తెల్పుతారు, నోటీసులు ఇవ్వకుండా కట్టడాలను ఎలా కూల్చివేస్తారన్నది నాగార్జున ప్రశ్న.  పైగా నియమానుసారం చూస్తే చెరువు విస్తీర్ణం 10 హెక్టార్లకంటే ఎక్కువగా ఉంటేనే 30 మీటర్ల బఫర్ జోన్ వర్తిస్తుంది.  కానీ ఎన్ కన్వెన్షన్ ఉన్న తుమ్మిడికుంట చెరువు విస్తీర్ణం 10 హెక్టార్లకంటే తక్కువగా ఉంది.  ఈ వివరాలను హెచ్ఎమ్ డిఏ వెబ్ సైట్లో చూడవచ్చునని కూడా నాగార్జున తెలియజేసారు.

మొత్తానికి ప్రస్తుతానికి నాగార్జున ఎన్ కన్వెన్షన్ కి ముప్పు తప్పింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles