All india medical science in andhra pradesh

aiims in andhra pradesh, all india medical science in andhra pradesh, center committed to aiims type institute in ap, ap reorganisation, dr. kamineni srinivas

all india medical science in andhra pradesh

సీమాంధ్రలో అభివృద్ధికి హాస్పిటల్స్ తో బోణీ

Posted: 07/01/2014 10:24 AM IST
All india medical science in andhra pradesh

రాష్ట్ర విభజన తర్వాత ఆదుకుంటామని మాటిచ్చిన ఆపన్న హస్తం అధికారంలో లేదు.  కానీ తెలుగుదేశం పార్టీకి స్నేహ హస్తాన్నందించిన భాజపా ప్రభుత్వం ఆ హామీలన్నిటినీ నెరవేరుస్తామని మాటిస్తూవస్తోంది.  ఏది ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నవాళ్ళకి ముందుగా హాస్పిటల్స్ తో బోణీ  కొడుతోంది కేంద్ర ప్రభుత్వం.

రాష్ట్ర మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఈ విషయంలో ఆశావహకమైన ప్రకటన చేస్తూ, విజయవాడ పరిసరాల్లో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) 1200 కోట్ల ఖర్చుతో రాబోతోందని, దీన్ని పరిశీలించటానికి రెండు రోజుల్లో కేంద్ర బృందం వస్తోందని తెలియజేసారు.  

రాష్ట్ర విభజన వలన విద్య, వైద్యసేవల విషయంలో ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ వాసులకు కష్టమౌతుందని సీమాంధ్ర నాయకులు అప్పట్లో అభ్యంతరాలు తెల్పటంతో వాటిని అభివృద్ధి చేస్తామని యుపిఏ ప్రభుత్వం మాటిచ్చింది.  దాన్ని ఎన్డియే ప్రభుత్వం ఇప్పుడు అమలు పరుస్తోంది.  

కొత్త హాస్పిటల్ తో పాటు ప్రస్తుతమున్న సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ని కూడా 292 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తామని, మఛిలీపట్నంలో 20 కోట్ల వ్యయంతో నర్సింగ్ కాలేజ్ ని నిర్మిస్తామని కూడా మంత్రి కామినేని శ్రీనివాస్ మాటిచ్చారు. 

మొన్న నందమూరి బాలకృష్ణ బసవతారక కేన్సర్ హాస్పిటల్ ని హిందూపురంలో నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు. 

ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి హాస్పిటల్స్ తో బోణీ కొడుతోంది

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles