Chandrababu naidu submits wishlist to pm narendra modi

chandrababu naidu submits wishlist to modi, tdp chief chandrababu naidu to meet pm narendra modi, cm chandrababu naidu meets pm narendra modi, tdp chief n chandrababu naidu, naidu met modi and discussed various issues in andhra pradesh, pm narendra modi at sriharikota

chandrababu naidu submits wishlist to modi,

బాబు అడిగనవన్నీ ఇచ్చేయండి: మోడీ

Posted: 06/30/2014 01:00 PM IST
Chandrababu naidu submits wishlist to pm narendra modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వరాలు కురిపించారు. శ్రీహరికోటలోని సతీష్ దవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి పీఎస్ఎళ్ వీ-సి23 9.52 గంటలకు విజయవంతం అవటంతో.. నరేంద్ర మోడీ చాలా ఆనందంగా ఉన్నారు.

ఆ సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో.. రాష్ట్ర విభజన వల్ల ఆంద్రప్రదేశ్ ఎలా నష్టపోయింది. ఎంత నష్టపోయింది అంత వివరంగా చెప్పటంతో.. అందుకు మోడీ సానుకూలంగా స్పందించి, వెంటనే అధికారుకుల ఆదేశాలు జారీ చేయటం జరిగింది. రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కోరినవన్నీ ఇవ్వాలని సంబంధిత అధికారులను మోడీ ఆదేశించారు. మోడీతో చంద్రబాబు ఏకాంతంగా 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేనేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని కోరినట్టు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న పరిస్థితిని, ఐపీకి కావాల్సిన సాయాన్ని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు.

chandrababu-naidu-submits-wishlist-to-pm

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను, దానికి అదనంగా చేయాల్సిన సాయం గురించి మోడీకి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ లోటు నుండి రాజధాని నిర్మాణానికి నిధులు, రైతు, డ్వాక్రా రుణమాఫీ, పునర్ వ్యవస్థీకరణ బిల్లులో ఉన్న విద్యాసంస్థల ఏర్పాటు, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ తదితర విషయాల ఆవశ్యకతను మోడీకి వివరించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. .ప్రధాని అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించారని, ఏపీకి అవసరమైన ప్రతి సాయం చేస్తామన్నారని, ఆ వేగాన్ని అందుకునే దిశగా మనం పని చేయాలన్నారు. ఏపీని ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు ఎంత సాయమైన చేసేందుకు సిద్ధమని మోడీ హామీ ఇచ్చారని చెప్పారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles