Smriti irani says she was called a burden at birth

hrd minister smriti irani, Smriti Irani says she was called a burden at birth, daughter is a burden, beti to bojh hoti hai, pm narendra modi, hrd ministry

Smriti Irani says she was called a burden at birth

కేంద్ర మంత్రిని పీక పిసికి చంపేయమన్నారు?

Posted: 06/27/2014 06:45 PM IST
Smriti irani says she was called a burden at birth

కేంద్ర మంత్రిని పీక పిసికి చంపేయమన్నారు. అంటే ఇప్పుడు కాదులేండి.. ఆడపిల్లగా పుట్టినందుకు .. పురిటిలోనే చంపేయమని .. కేంద్రమంత్రి తల్లికి బంధువులు, ఊరిలోని కొంతమంది నూరిపోశారు. అంటే అప్పట్లో ఆడపిల్లను పెంచటం చాలా భారంగా ఉండేంది. అందుకే ఆడపిల్లపై ఇలాంటి దాడులు జరిగేవని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన చిన్ననాటి విషయలను గుర్తుకు తెచ్చుకుని కన్నీరు పెట్టుకున్నారు.

అయితే ఆ సమయంలో కేంద్ర మంత్రి కన్నతల్లి దైర్యం చేసి, అందర్ని ఎదిరించి నన్ను పెంచింది. ఆడపిల్ల అనే వివక్ష చూపకుండా ధైర్యంగా మా అమ్మ పెంచింది. కాలక్రమంలో ఆ అమ్మాయి ఉన్నత స్థాయికి చేరుకుంది. నేను ఈరోజు ఈస్థాయిలో ఉండటానికి కారణం అంత మా అమ్మే అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెబుతున్నారు. ఆ నాడు నా తల్లి తీసుకున్న నిర్ణయమే.. ఈరోజు నేను మంత్రి అయ్యానని కేంద్ర మావన వనరుల అభివృద్ది శాఖ మంత్రి స్మృతి ఇరానీ తన జీవిత చరిత్ర చెప్పటం జరిగింది.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. తాను జన్మించినపుడు తల్లికి ఎదురైన అనుభవాన్ని తొలిసారి బయటపెడుతున్నానని చెప్పారు. అమ్మాయిలకు చదువు చెప్పిస్తే కుటుంబానికి ఉపయోగపడుతుందని, తద్వారా దేశపురోభవృద్దికి తోడ్పడుతుందని స్మృతి అన్నారు. నా తల్లి ఆనాడు ధైర్యమైన నిర్ణయం తీసుకోవడం వల్లే నేను రోజు కేంద్ర మంత్రి కాగలిగానని అన్నారు. ఆడపిల్లలను భారంగా భావించరాదని మంత్రి చెప్పారు. ఆడపిల్లలే అందరి ఆదర్శం అనే రోజులు వస్తున్నాయని మంత్రి గర్వంగా చెప్పారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles