Chandrababu and state ministers tour delhi

delhi tour of chandrababu successful, union ministers assure full cooperation to ap, ap gets promises for funds release for developmental activities, chandrababu and state ministers tour delhi

chandrababu and state ministers tour delhi

ఆంధ్రప్రదేశ్ కి ఢిల్లీ బాసట

Posted: 06/27/2014 10:09 AM IST
Chandrababu and state ministers tour delhi

గురువారం ఢిల్లీకి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజి బిజీ గా తిరిగారు.  ఉదయం నుండి రాత్రి వరకు మొత్తం తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సమావేశమైన
చంద్రబాబు వారి నుంచి రాష్ట్రం కోసం వివిధ హామీలను పొందారు.  

నేరుగా కేంద్ర మంత్రులతోనే భేటీ అయిన చంద్రబాబు నాయుడు తనతో పాటు రాష్ట్ర మంత్రులను కూడా తీసుకెళ్ళి పరిచయం చేసి రాష్ట్రంలోని సమస్యలను వాళ్ళచేతనే చెప్పించారు.  

అందులో ప్రముఖంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుండి రూ.15,600 కోట్ల సత్వర ప్యాకేజీ విషయంలోను, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించటంలోనూ నిర్దిష్టమైన హామీలను పొందారు.  ఇది కాకుండా అదనపు సహాయంగా కేంద్రం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.5,600 కోట్ల గురించి, రైతులకు ఋణ మాఫీ గురించి అరుణ్ జైట్లీతో చర్చించారు. వీటన్నిటిమీదా అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించారు.  

రాజధానిని మీరు నిర్ణయించండి, వెంటనే దాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించి నిర్మాణాన్ని ప్రారంభిస్తాం, మెట్రో లైన్లను ప్రారంభిస్తాం అంటూ పట్టణాభివృద్ధి శాఖామాత్యులు వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు.  

13 ఓడరేవులను కలుపుతూ కోస్తా కారిడార్ ని ఏర్పాటు చెయ్యటం, విశాఖపట్నాన్ని రైల్వే జోన్ గా ప్రకటించటం, జాతీయ సంస్థల స్థాపన విషయంలోను సంబంధిత మంత్రులు హామీ ఇచ్చారు.  నిరంతర విద్యుత్ ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పీయూష్ గోయల్ మాటిచ్చారు.  చంద్రబాబుకి విద్యుత్ రంగం మీద ఉన్న సంపూర్ణ అవగాహనకు పీయూష్ గోయల్ ఆయనను అభినందించి, ఆయన దగ్గర తాను చాలా నేర్చుకున్నానని అన్నారు.  ఐఐటి ఐఐఎంల స్థాపనకు స్థలాన్ని చూపిస్తే ప్రారంభిస్తామంటూ మానవవనరుల మంత్రి
స్మృతి ఇరానీ అన్నారు.  

మొత్తానికి రోజంతా సద్వినియోగం చేసుకున్న  చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనంలో కేంద్రం నుంచి నిర్ధిష్టమైన హామీలను పొందటంలో కృతకృత్యులయ్యారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles