Airport in chandrababu naidu home town kuppam

airport in kupppam mandal, kuppam andhra pradesh, chittor district, ap cm chandrababu naidu home town kuppam, andhra pradesh airport, tdp, airport in andhra pradesh.

ap cm chandrababu naidu home town kuppam

బాబు జన్మస్థలంలోనే ఎయిర్ పోర్టు

Posted: 06/26/2014 11:14 AM IST
Airport in chandrababu naidu home town kuppam

అవును బాబు పుట్టిన జన్మస్థలంలోనే  ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసేందుకు  ఆంద్రప్రదేశ్ అధికారులు రెడీ అవుతున్నారు. అసలు ఇంతకీ  ఏ బాబు పుట్టిన జన్మస్థలం? ఎవరు బాబు ? అనే అనుమానాలు అందరికి వస్తాయి.  కానీ ఆ బాబు.. మన బాబే.  కాదు.. కాదు..  సీమాంద్ర రాష్ట్రానికి   చంద్రయ్య,  తెలుగు ప్రజలకు  చందమామలాంటి   చిత్తూరు జిల్లా  కుప్పం నియోజక వర్గం నారా చంద్రబాబు నాయుడు. ఆరు పదులు దాటిన వయసులో  మూడోసారి  ముఖ్యమంత్రి అయిన  చంద్రబాబు.  ఆంద్రప్రదేశ్ ను  సింగపూర్ చేయటానికి రాత్రి పగలు తెగ కష్టపడుతున్నారు.  అందులో బాగంగానే.. కుప్పం లో విమానాశ్రయం ఏర్పాటు చేయటానికి  అధికారులు సిద్దమయ్యారు.

ఆంద్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు  సొంత  నియోజకవర్గమైన  కుప్పం  సమగ్రాబివృద్ది పై దృష్టి సారించారు.     అన్ని రంగాల్లో  సమస్యల  పరిష్కారంతో పాటు ఏయే  రంగాల్లో  ఎలాంటి  అభివృద్ది  పనులు చేపట్టాలన్న  దానిపై  ప్రణాళిక తయారు  సిద్దమవుతుంది.   ఈ బాద్యతను  చంద్రబాబు  చిత్తూరు కలెక్టర్  గిరిథర్ కి  అప్పగించారు. ఆయన  సీఎం పేషీలో  ముఖ్యకార్యదర్శిగా పని చేస్తున్నారు.

ఇటీవల చంద్రబాబు  కుప్పంలో  పర్యటించినప్పుడు  ఒక రైతు  తన ఎకరం పొలంలో  గులాబీలు పండించటం ద్వారా రూ. 50 లక్షల దాకా ఆదాంయ  సంపాదించినట్లు  తెలిపారు  యూరప్ లో వీటికి బాగా గిరాకీ ఉందని,  అక్కడికి ఎగుమతి  చేయటానికి  మెరుగైన సౌకర్యాలుంటే బాగుంటుందని ఆ రైతు  చంద్రబాబుకు చెప్పటం జరిగింది.  ఇలాంటి  అవసరాలు  దృష్టిలో పెట్టుకొని  చంద్రబాబు  కుప్పంలో చిన్నపాటి విమానాశ్రయం ఏర్పాటు చేస్తే  బాగుటుందని  భావించి ,  అధికారులతో  చర్చలు జరిపి,  విమానాశ్రయం  ఏర్పాటు కు  చర్యలు తీసుకోవటానికి   చంద్రబాబు సిద్దమవుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles