Mother leaving baby in car to go to a night club

mother leaves baby in car to go to a night club, mother arrested for leaving baby in car, Woman arrested for leaving kids in car, Mom arrested for leaving toddler in car to go to night club

mother leaves baby in car to go to a night club

కారులో పాలు తాగే పాప-తల్లి క్లబ్ లో ?

Posted: 06/25/2014 04:37 PM IST
Mother leaving baby in car to go to a night club

పాలు తాగే పాప వదిలి ఏ కన్నతల్లి వదిలిపెట్టదు. ‘‘దేవుడు దిగొచ్చి వరం ఇస్తానన్నా.. కన్నబిడ్డను అస్సలు వదిలిపెట్టుదు’’ కన్నపేగు గురించి  తెలిసిన ఏ మాతృమూర్తి.. తన బిడ్డాను కంటికి రెప్పాలా కాపాడుకుంటుంది. అయితే రోజులు మారాయి, మనుషులు మారారు, అలవాట్లు మారాయి, కొత్త కొత్త పోకడలు .. కన్నబిడ్డల బందానికి దూరం చేస్తున్నాయి.

అమ్మా అనే పిలుపుతో తల్లి కలిగే ఆనందం  మాటల్లో చెప్పలేనిది, రాతల్లో రాయలేనిది.  కానీ ఇక్కడ మాత్రం  ఒక కన్నతల్లి .. కొన్ని గంటల ఎంజాయ్ కోసం ..పాలు తాగే పాపను.. కారు పెట్టి లాక్  చేసి వెళ్లింది.  ఈ సన్నివేశం అచ్చం మన తెలుగు సినిమాలో జరిగినట్లుగా ఉంది. ‘‘చిరంజీవి, త్రిష, ఖుష్బూ నటించి స్టాలిన్ సినిమాలో  ఒక చంటి పాప ను  కారులో పెట్టి కన్నతల్లి  మెడికల్ షాపులోకి వెళుతుంది. ఇంతలో ట్రాఫిక్  ఫోలీసులు వచ్చి ఆ కారు తీసుకుపోతారు’. అది సినిమా కాబట్టి సరిపోయింది. కానీ ఇది రియల్ జీవితం.  రీల్  మీద అయితే పాప ప్రాణాలు  హీరో బతికిస్తాడు. కానీ ఇక్కడ అలా జరగలేదు.

ఇక్కడ మాత్రం కన్నతల్లి పాపను  కారులోపెట్టి, నైట్ క్లబ్ లో ఎంజాయ్ చేయటానికి వెళ్లింది.  అంటే కన్నబిడ్డ కంటే.. నైట్ క్లబ్ కే ఫిదా అయ్యింది. అందుకే  పోలీసులు గట్టి షాకిచ్చారు.  ఈశాన్య హారీస్  కౌంటికి  చెందిన  ఉజ్మా షేక్ అనే మహిళ తన పిల్లవాడితో  సహా నైట్ క్లబ్బులోకి వేళ్లేందుకు  ప్రయత్నించింది.

అయితే  గేటు వద్ద ఉన్న వాచ్ మెన్  అభ్యంతరం చెప్పటంతో వెంటనే ఆమె కారు వద్దకు వెళ్లి , ఒంటరికి గా తిరిగి వచ్చింది.  తన స్నేహితురాలి వద్ద పిల్లాడిని వదిలిపెట్టినట్లు వాచ్ మెన్ కు  చెప్పింది. దీంతో ఆ వాచ్ మెన్ కు అనుమానం వచ్చి, కారు వద్దకు వెళ్లాడు. తీరా చూస్తే కారులో పిల్లాడు ఒంటరిగా ఉన్నాడు. పిల్లాడిని నిర్లక్ష్యంగా అలా వదిలేసినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేసి.. తర్వాత 1.20 లక్షల రూపాయల బాండు సమర్పించడంతో వదిలిపెట్టారు. ఏమైన ప్రపంచంలో ఇలాంటి  తల్లులు కూడా ఉంటారా? అనే అనుమానం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏం చేస్తాం చెప్పండి అంత కంప్యూర్ల కాలం.. ఇలాగే ఉంటుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles