Telangana nativity for fees reimbursement

Telangana Nativity for Fees Reimbursement, Professional Students Fees Reimbursement in Telangana, Mulki rules prevailing in Telangana, Mulki rules of Hyderabad state

Telangana Nativity for Fees Reimbursement

ఇంటిపేరిచ్చినవాడే స్థానికతనూ ఇస్తాడా?

Posted: 06/25/2014 10:18 AM IST
Telangana nativity for fees reimbursement

తెలంగాణాలో చదువుకుంటున్న విద్యార్థులకు కాకుండా, తెలంగాణాల విద్యార్థులకే ఫీజు రియంబర్స్ మెంట్ చేస్తామని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు.  ఏ రాష్ట్రం విద్యార్థులకు ఆరాష్ట్ర ప్రభుత్వమే ఫీజులను చెల్లించాలన్న మాటను ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా అంగీకరించారు, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని కూడా మాటిచ్చారు.  కానీ తెలంగాణా విద్యార్థులుగా ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్ మెంట్ పొందాలంటే స్థానికతను నిరూపించుకోవాలన్న నియమంలో, విద్యార్థులే కాదు వాళ్ళ తండ్రి కూడా తెలంగాణాలో పుట్టివుంటేనే అర్హత లభిస్తుందని చెప్పటాన్ని విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు.  

అంటే ఇంటిపేరిచ్చిన కన్నతండ్రే తెలంగాణా విద్యార్థులకు స్థానికతను కూడా సంప్రాప్తించేట్టు చేస్తాడన్నమాట.  ఉద్యమం 60 సంవత్సరాల కాక మరిన్ని సంవత్సరాలదైయ్యుంటే తండ్రే కాదు తాత కూడా తెలంగాణాలో పుట్టివుంటేనే స్థానికత అని అనుండేవారా అని ప్రశ్నిస్తున్నారు.  

ఒకప్పుడు ముల్కీ సర్టిఫికేట్ అని తెలంగాణా ప్రాంతంలో అమలులో ఉండేది.  ముల్క్ అంటే సొంత ప్రాంతం.  ముల్కీ అంటే ఆ ప్రాంతానికి చెందినవాడు అని అర్థం.  నిజామ్ 1919 లో ఇచ్చిన ఫర్మానా ఆధారంగా ఆర్టికిల్ 371 డి లో ముల్కీ నియమాల ప్రస్తావన జరిగింది.  ముల్కీ నియమం ఆ తర్వాత కాలంలో అనవసరమైనదంటూ ఎత్తివేయటం జరిగింది కానీ ఆ ముల్కీ నియామనలే పరిశీలిస్తే ఒక వ్యక్తి ముల్కీ అనాలంటే ఈ క్రింది విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

1. హైద్రాబాద్ స్టేట్ లో పుట్టివుండాలి.

2. హైద్రాబాద్ స్టేట్ లో జీవిస్తూ వుండాలి.  లేదా

3. పుట్టిన సమయానికి అతని తండ్రి హైద్రాబాద్ స్టేట్ లో 15 సంవత్సరాలు ఉద్యోగంలో ఉండివుండాలి.  

4. ముల్కీ కి భార్యైనా అయ్యుండాలి.  

5. 15 సంవత్సరాలు హైద్రాబాద్ స్టేట్ లో జీవిస్తూ తిరిగి వెళ్ళకుండా ఇక్కడే నివాసం ఉండే ఆలోచనతో ఉండాలి.

పైన ఎక్కడా తండ్రి ముల్కీ అయితేనే పిల్లవాడు ముల్కీ అన్న నిబంధన కనపడదు.  పై నియమాల ఆధారంగా పై చదువులకు, ప్రభుత్వ కార్యాలయాలలో కొలువులకు ముల్కీ సర్టిఫికేట్ ని తీసుకుని దాఖలా చేసేవారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles