Man save his life though using whatsapp

whatsapp, man save his life though using whatsapp, technology, mobile app, whatsapp technology

man save his life though using whatsapp

ప్రాణాన్ని కాపాడిన వాట్స్ యాప్

Posted: 06/24/2014 03:10 PM IST
Man save his life though using whatsapp

టెక్నాలజీ ఎంత పెరిగితే మనిషి మస్తిష్కం కూడా దానితో సమానంగా పనిచేస్తేనే దాని పూర్తి ఉపయోగం ఉంటుంది. ఈ కాలంలో యువతది అందులో అందెవేసిన చెయ్యే.

బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఢిల్లీ వాసి గౌరవ్ కర్నాటక లో తమకూరు జిల్లాలోని మధుగిరి ఏకశిల కొండకు వెళ్ళాడు. అతనితోపాటు వెళ్ళిన అతని స్నేహితురాలు ప్రియాంక శర్మ సగం దూరం ఎక్కిన తర్వాత ఇక నా వల్లకాదంటూ వెనక్కి పోతుంటే గౌరవ్ మాత్రం లేదు నేను ఇంకా పైకి ఎక్కుతానంటూ వెళ్ళాడు.

ఆతర్వాత గౌరవ్ 60 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోయాడు. ఇంతలో ప్రియాంక శర్మ ఎంతకీ తిరిగిరాలేదేమా అని ఫోన్ చెయ్యటంతో తనున్న పరిస్థితిని వివరించి ఆ ప్రాంతం ఫొటోలను కూడా వాట్స్ యాప్ సాయంతో పంపించాడు. వాటి ఆధారంగా ఆమె పోలీసులను ఆశ్రయించి అతన్ని మొత్తానికి రక్షించటం జరిగింది. అంత ఎత్తు నుంచి పడినా గౌరవ్ తనని తాను కూడదీసుకుని పూర్తి ఎరుకలో అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించటం వలనే అక్కడి నుంచి బయటపడ్డాడు.

అందువలన, టెక్నాలజీ అందుబాటులో ఉండటమే కాకుండా ఆపద సమయంలో ప్రెజెంస్ ఆఫ్ మైండ్ ఉండటం, కంగారు పడకుండా స్పష్టంగా కమ్యూనికేట్ చెయ్యటం కూడా ముఖ్యమేనని ఈ సంఘటనతో తెలుస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles