Namo anti virus software for pcs

namo anti virus, software to aple company, namo anti-virus software for pcs, Innovazion IT firm namo antivirus, IT firm Innovazion has named its new anti-virus software NaMo, Namo AV is Free Antivirus software, antivirus software NaMo

namo anti-virus software for pcs

నమో ఉచిత యాంటీ వైరస్

Posted: 06/24/2014 01:05 PM IST
Namo anti virus software for pcs

నరేంద్ర మోదీ ప్రభావం రోజురోజుకీ పెరిగిపోవటంతో ఎన్నికల ముందు నమో పేరుతో గేమ్స్ వచ్చినట్లుగానే ఇప్పడు యాంటీ వైరస్ ఒకటి మార్కెట్ లోకి వచ్చింది. విడుదలైన ఈ బేసిక్ యాంటీ వైరస్ ని ప్రస్తుతానికి ఉచితంగానే అందిస్తున్నారు.

ఇన్నోవాజియన్ అనే భారత సంస్థ రూపొందించిన నమో యాంటీ వైరస్ ని పిసి లను లాప్ టాప్ లను సమర్ధవంతంగా వైరస్ బారి నుంచి రక్షించటానికి ఉపయోగపడుతుందని చెప్పిన ఈ సంస్థ యాపిల్ సంస్థకు చెందిన మాక్ కి కూడా సాఫ్ట్ వేర్ లను తయారుచేస్తున్నామని చెప్తోంది.

అయితే ఈ బేసిక్ మోడల్ అందుకు తగ్గట్టుగా కేవలం ప్రాథమిక స్థాయిలోనే పనిచేస్తుంది. త్వరలోనే అడ్వాన్స్ డ్ వెర్షన్ ని తీసుకురాబోతున్నమని ఇన్నోవాజియన్ సంస్థ ప్రకటిస్తోంది. నమో పేరుతో విడుదలైన ఈ యాంటీ వైరస్ మోదీ క్రేజ్ తో బాగా ఉపయోగంలోకి రావచ్చిని ఆ సంస్థ ఆశిస్తోంది. దీనికి అలవాటుపడి, ఇందులోని సౌకర్యాలు నచ్చి, ఇందులో హైయర్ వర్షన్ వస్తోందని తెలిసి దాన్ని కొనుగోలు చెయ్యటం ద్వారా ఆ తర్వాత విడుదల చెయ్యబోయే సెకండ్ వెర్షన్ ని వాడకందార్లు కొనుగోలు చేసి వాడుకుంటారని ఈ సంస్థ నమ్ముతోంది.

ఇంటర్నెట్ వాడకంలో భారత్ మూడవ స్థానంలో ఉందని, కానీ కేవలం 13 శాతం మాత్రమే లైసెన్స్ ఉన్న యాంటీ వైరస్ లను వాడుతున్నారని, 30 శాతం మంది ట్రయల్ వెర్షన్స్ ని రి ఇన్ స్టాల్ చేసుకుంటున్నారని ఇన్నోవాజియన్ సియిఓ అభిషేక్ గగ్నేజా అన్నారు. మిగిలిన 57 శాతం వాడకం దార్లు వైరస్ నుంచి ఎటువంటి రక్షణా లేకుండానే కంప్యూటర్లను వాడుతున్నారని, కంపెనీ ఆ వినియోగదార్లనే లక్ష్యంగా ఈ నమో యాంటీ వైరస్ ఉత్పాదనను మార్కెట్ చేస్తోందని కూడా ఆయన తెలియజేసారు.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles