Age no barrier for keeping one happy funny video

Age no barrier for keeping one happy funny video, funny video showing grandma dancing, Grandma dancing funny video

Age no barrier for keeping one happy funny video

కర్రపట్టుకునే వయసులో కుర్రకారులా ....

Posted: 06/17/2014 11:09 AM IST
Age no barrier for keeping one happy funny video

ఆనందానికి వయసుతో పనిలేదు.  శరీరం సహకరించాలి, దానికి ముందు మనసు తేలిగ్గా ఆహ్లాదంగా ఉండాలి.  

డ్యాన్సనేది శరీరమంతటికీ రక్త ప్రసరణ చెయ్యటంతో పాటు మెదడుకి కూడా సరిపడేంత శక్తిని సరఫరా చేస్తుంది.  దానివలన ఆనందం పెల్లుబుకుతుంది కాబట్టి పాశ్చాత్య దేశాలలో అన్ని శుభ సందర్భాలలోనూ డ్యాన్స్ చెయ్యటం ఆనవాయితీగా వస్తోంది.  ఈ సాంప్రదాయాన్ని ఉత్తర భారత దేశంలో కొన్ని ప్రాంతాల్లో వివాహాది వేడుకల్లో చూడవచ్చు.  తెలంగాణాలో కూడా ఈ ఆనవాయితీ వచ్చింది ముఖ్యంగా పెళ్ళిళ్ళల్లో.  

ఈ క్రింది వీడియోలో చూడండి. పెద్ద వయసులోని వారు డ్యాన్స్ చేస్తుంటే యువకులు కూర్చుని చూసి ఆనందిస్తున్నారు.  చిన్నప్పటి నుంచీ ఆ అలవాటుండటం వలన కాబట్టే కానీ లేకపోతే కర్రపట్టుకుని నడిచే వయసులో కుర్రకారుతో సమానంగా ఆడగలరా.  అలా నడుం తిప్పగలరా.

చాలామంది పెద్దవాళ్ళని చూస్తే ముందుగా వాళ్ళు వాళ్ళ యోగక్షేమాలా కంటే ఎక్కువగా పరస్పరం అనుభవిస్తున్న బాధలను గురించి చెప్పుకుంటుంటారు.  ఎంత ఎక్కువ బాధలను చెప్పగలిగితే అంత ఆనందం వాళ్ళకి.  ఎదుటివారు పలకరించాలి, సానుభూతి చూపాలి అనే భావన ఎక్కువగా కనపడుతుంది.  కానీ మానసికంగా వృద్ధాప్యం రానివాళ్ళకి మాత్రం ఎప్పుడూ ఆనందమే.  వాళ్ళు పంచుకునేది ఆనందమే ఉంటుంది కానీ సొంత బాధలను కాదని ఈ వీడియో మనకు చెప్తోంది కదూ!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles