Misleading ads

Misleading ads, photo trickery to impress consumers, Better looking goods as real ones in ads, Sugar coating act in Ads

Misleading ads, photo trickery to impress consumers

ఆకట్టుకోవటానికి యాడ్ లలో అడ్డదార్లు

Posted: 06/13/2014 03:42 PM IST
Misleading ads

వ్యాపార ప్రకటనలు చేసేవారు తరచుగా వినియోగదారులను ఆకట్టుకోవటానికి అడ్డదార్లు తొక్కుతుంటారు.  కానీ వ్యాపార ప్రకటనలకు ఆదరణ తగ్గటం లేదు.  వ్యాపార ప్రకటనలు మోసపూరితాలైపోయాయనటానికి ఈ క్రింది ఉదాహరణలు చాలు.

తేనె ప్రకటనలో తినుబండారాల మీద వేసే మోటార్ ఆయిల్ నిజంగా తేనె కంటే చాలా బాగా కనిపిస్తుంది.  హ్యామ్ బర్గర్ ఫోటోలో బాగా కనిపించాలంటే దానికి బ్రౌన్ షూ పోలిష్ బాగా సహకరిస్తుంది.  పండ్లు బాగా కనిపించాలంటే వాటి మీద హెయిర్ స్ప్రే చెయ్యాలి.  సోడాలో గాలి బుడగలు బాగా కనిపించాలంటే ఆంటాసిడ్స్ కాని లేదా సబ్బు నురగ కాని ఉపయోగిస్తారు.  సిరియల్స్ లో పాలను వేస్తున్న దృశ్యం బాగా కనిపించాలంటే షాంపూ కానీ లేదా జిగురు కానీ వెయ్యవలసివుంటుంది.  ఐస్ క్రీంలా కనిపించటానికి ఉడకబెట్టి నలగకొట్టిన బంగాళా దుంప బాగా పనికివస్తుంది.  ఐస్ క్రీం మీద సిరప్ నిలవటానికి పేపర్ టవల్ ఉపయోగిస్తారు.  వీటన్నిటినీ కింది ఫొటోలో చూడండి.

ads1

అలా అసలు ఉత్పాదనలు కంటికింపుగా కనిపించటానికి చేసే పనులే కాకుండా ఫోటో తీసే కోణాన్ని బట్టి కూడా దానిలో తేడా వస్తుంది.  ఫోటొలో లైటింగ్ ఇతర ఫోటోషాప్ ఎడిటింగ్ లతో ఉత్పాదనలకు కొత్త అందాన్ని తీసుకునివచ్చి, వాటిని వినియోగదారులు ఇష్టపడేట్టుగా చేస్తారు.  బర్గర్లు, శాండ్ విచ్ లు, కుకీలు ఈ క్రింది ఫోటోల్లో అసలు రూపాలకు బదులుగా ఎలా కనిపిస్తున్నాయో చూడండి.  

ads2

ads3

ఫొటో తీసే విధానంలో ప్రదేశానికి అందం పెరుగుతుంది.  దీన్ని ఉపయోగించుకుని హోటళ్ళు, రిసార్ట్ ల ఫోటోగ్రాఫ్ లు అసలున్నవాటికన్నా ఎంతో సుందరంగా కనిపిస్తాయి.  చిన్న పిల్లల ఆడుకునే వస్తువులు వ్యాపార ప్రకటనలో కనిపించేదానికంటే వాస్తవానికి చిన్నవిగా ఉండి పిల్లలను నిరుత్సాహపరుస్తాయి.  

ads4

అయినా వినియోగదారులు చాలా విశాల హృదయులు.  ప్రకటనలను చేసేవారిని ఆదరిస్తారు.  ఒక సుందరమైన కలని నమ్మి దాని అనుభూతిలో ఉన్న విధంగానే వ్యాపార ప్రకటనలను నమ్ముతూ దానిలోని రచనాచమత్కారాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఆ ఉత్పాదనలకు పడిపోతుంటారు.  అందువలనే ఇంకా వ్యాపార ప్రకటనలు సుందరమైన స్వప్నాన్ని చూపించటంలో ఒకదాన్ని మించి మరొకటి ముందుకు దూసుకెళ్తున్నాయి.  

ads5

చిన్న పిల్లలు సినిమాలు, సీరియల్స్ కంటే వ్యాపార ప్రకటనలను చూడటానికే ఎక్కువ మొగ్గు చూపిస్తుంటారు.  పెద్దలూ అంతే- వారికి కావలసిన స్వప్నం వారు వీక్షిస్తారు.  అందుకే టివి ఛానెల్స్ లో ప్రత్యేకంగా వ్యాపార ప్రకటనలను చూపించటానికే ప్రత్యేకమైన ఛానెల్స్ ఆవిర్భవించాయి.  

ఎంత మంచి వస్తువైనా కంటికింపుగా కనిపించకపోతే వాటిని ముట్టుకుంటామా.  అందుకే ఎలాంటి వస్తువునైనా కేమెరా లెన్స్ కి ఇంపుగా కనిపించేట్టుగా వాటికి మేకప్ చేస్తుంటారు మన వ్యాపార ప్రకటనలు చేసే వృత్తిలోనివారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles