20th fifa tournaments started at brazil

FIFA World Cuy 2014, 20th FIFA tournaments started at Brazil, FIFA World Cup opening ceremony

FIFA World Cup 2014, 20th FIFA tournaments started at Brazil

బ్రెజిల్ లో 20వ ఎఫ్ఐఎఫ్ఏ ప్రపంచ కప్ ప్రారంభం

Posted: 06/13/2014 11:46 AM IST
20th fifa tournaments started at brazil

జూన్ 12 నుంచి జూలై 13 వరకు బ్రెజిల్ లో జరిగే ఎఫ్ఐఎఫ్ఏ ప్రపంచ కప్ సాకర్ టోర్నమెంట్ కి శావో పాలో లోని కోరింథియన్స్ ఎరినా లో గాయని, నటి జెన్నిఫర్ లోపేజ్, బ్రెజెలియన్ పాప్ సింగర్ క్లాడియా లియట్, ర్యాపర్ పిట్ బుల్ ల ప్రదర్శన "వియ్ ఆర్ ఒన్" తో, అది విన్న 64000 మంది ప్రేక్షకుల కేరింతలు, కరతాళ ధ్వనులతో  ప్రారంభమైంది.    

1950 తర్వాత 2014 బ్రెజిల్ రెండవసారి ఎఫ్ఐఎఫ్ఏ ప్రపంచకప్ సాకర్ ని నిర్వహిస్తోంది.  టోర్న్ మెంట్ ప్రారంభవేడుకలలో పాటలు, డ్యాన్స్ లు, డ్రమ్ ల ధ్వనులు, జిమ్నాస్ట్ ల ప్రదర్శనలకు 4.5 మిలియన్ పౌండ్ల ఖర్చయింది.  


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/FIFAWorldCup2014OpeningCeremony

బ్రెజిల్ లోని 12 నగరాల్లో 32 దేశాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాబృందాలు 31 రోజుల్లో 63 మ్యాచ్ లలో పాల్గొంటారు.  మొదటి గ్రూప్ స్టేజ్ లో ఎలిమినేట్ అయ్యే బృందాలు 8 మిలియన్ అమెరికన్ డాలర్లు, 16 వ రౌండ్ లో ఎలిమినేట్ అయ్యేవారు 9 మిలియన్ డాలర్లు, క్వార్టర్ ఫైనల్లో 14 మిలియన్ డాలర్లు, నాల్గవ స్థానాన్ని ఆక్రమించిన వారు 20 మిలియన్ డాలర్లు, మూడవస్థానంలో నిలిచినవారు 22 మిలియన్ డాలర్లు, రన్నర్లు 25 మిలియన్ డాలర్లు, ఎఫ్ఐఎఫ్ఏ లో ప్రథమ స్థానంలో విజయం సాధించినవారు 35 మిలియన్ డాలర్లతో పాటు ప్రపంచ కప్ ని గెలుచుకుంటారు.  

టోర్నమెంట్ కి ముందే 32 క్రీడా బృందాలకు ఒక్కొక్కరికి 1.5 మిలియన్ డాలర్లను ప్రాథమిక ఖర్చుల కోసం ఇచ్చారు.  మొత్తం ఎఫ్ఐఎఫ్ఏ 2014 ఖర్చు 576 మిలియన్ డాలర్లు.

2014 ఎఫ్ఐఎఫ్ఏ లో వాడే అధికారిక అడిడాస్ బజూకా బంతిని ఉత్పత్తిని చేసిన వారు పాకిస్తాన్ లోని సియాల్కోట్ కి చెందిన ఫార్వర్డ్ స్పోర్ట్ వారు.  

మొదటిసారిగా ఈ టోర్నమెంట్ లో గోల్ లైన్ టెక్నాలజీని వాడుతున్నారు.

-శ్రీజ

31 రోజుల్లో

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles