117 vacancies in rbi for grade b officers

117 vacancies in RBI for grade B Officers, Grade B officers wanted by RBI, RBI recruits grade B officers

117 vacancies in RBI for grade B Officers

రిజర్వ్ బ్యాంక్ లో 117 ఖాళీలు

Posted: 06/07/2014 05:15 PM IST
117 vacancies in rbi for grade b officers

117 గ్రేడ్ బి ఆఫీసర్ల డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కి రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్ ని జారీ చేసింది.  

ఇందులో రిజర్వేషన్ లేనివి 58, ఎస్ సి 15, ఎస్ టి 8, ఓబిసి 36 ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు.  

ఇది కేవలం ఆన్ లైన్ లోనే అప్లై చెయ్యాలి కానీ అప్లికేషన్ ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకుని దాన్ని నింపి బోర్డ్ ఆఫీస్ కి పంపించటం చెయ్యగూడదు.  ఆన్ లైన్ లో అప్లై చెయ్యటానికి వెబ్ సైట్  www.rbi.org.in

గమనించవలసిన తేదీలు

ఆన్ లైన్ అప్లికేషన్ కోసం వెబ్ సైట్ ఈ మధ్య తేదీల్లో అందుబాటులో ఉంటుంది- 03.06.2014 – 23.06.2014
ఆన్ లైన్లో ఫీజ్, ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపు – 03.06.2014 – 23.06.2014
ఆఫ్ లైన్లో ఫీజ్, ఇంటిమేషన్ ఛార్జీల చెల్లింపులు బ్యాంక్ శాఖలలో – 05.06.2014 – 26.06.2014

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవటానికి ముందుగా చెయ్యవలసిన పనులు

మీ ఫొటోని, సంతకాన్ని స్కాన్ చేసి తయారుగా పెట్టుకోవాలి.
ఆన్ లైన్ చెల్లింపు చెయ్యదలచుకున్నవారు అందుకు సంబంధించిన పత్రాలను తయారుగా పెట్టుకోవాలి.  
అభ్యర్థులు ఈ మెయిల్ ఐడి కలిగివుండాలి, దాన్ని పూర్తి ఫలితాలు వచ్చేంతవరకు యాక్టివ్ గా పెట్టుకోవాలి.  

ఆన్ లైన్ అప్లికేషన్ ని సరిగ్గా నింపాలి.  ఆ తర్వాత మార్పులు, చేర్పులు అనుమతించబడవు.   అప్లికేషన్ ని పూర్తిగా నింపిన తర్వాత స్క్రీన్ మీద అభ్యర్థి రిజిస్ట్రేషన్ క్రమసంఖ్య, పాస్ వర్డ్ జెనరేటై వస్తుంది.  వాటిని జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి.  ఈమెయిల్ ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా వాటిని పంపబడుతుంది.  

ఒకవేళ అభ్యర్థులు ఒకేసారి అప్లికేషన్ ని పూర్తిగా నింపలేని సందర్భంలో నింపినంత వరకు డేటాని సేవ్ చేసుకోవచ్చు.  అలాంటప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ ఇవ్వబడతాయి.  ఆ తర్వాత వాటి సాయంతో మరోసారి అప్లికేషన్ ని తెరిచి వాటిని నింపవచ్చును.  అప్లికేషన్ ని పూర్తిగా నింపటం జరిగిన తర్వాత దాన్ని సబ్మిట్ చేసి తగు ఫీజును చెల్లించవలసివుంటుంది.  

మిగతా వివరాలు రిజర్వ్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ www.rbi.org.in లో చూడవచ్చును.  వెబ్ సైట్ లో ABOUT US> OPPORTUNITIES AT RBI>CURRENT VACANCIES> VACCANCIES లో అప్లికేషన్ ని నింపవచ్చును.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles