Telangana to be the new state song

Telangana to be the new state song, state song of Telangana, aya jaya he Telangana, Dr Ande Sri, fficial song of Telangana state.

Telangana to be the new state song

ఇక తెలంగాణ అధికారిక గేయం ఇదే?

Posted: 05/31/2014 12:41 PM IST
Telangana to be the new state song

తెలంగాణకు రాష్ట్ర గీతం సిద్ధమైంది. జూన్ 2 నుంచి ఈ గేయం అధికారిక గేయం కానుంది. డాక్టర్ అందెశ్రీ ఈ గేయాన్ని రచించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ఇదే..

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

జానపద జన జీవన జావళీలు జాలువార
జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర
వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి
తరుగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగ
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles