Congress party senior leader jaipal reddy new post in high command

jaipal reddy new post, Congress party, telangana leader jaipal reddy, Sonia Gandhi, Sonia Gandhi plans to overhaul party, Rahul gandhi.

Congress party senior leader jaipal reddy new post in high command, , Sonia Gandhi plans to overhaul party organisation,

జైపాల్ రెడ్డి చేతిలో కొత్త పగ్గాలు?

Posted: 05/31/2014 10:48 AM IST
Congress party senior leader jaipal reddy new post in high command

ఎన్నికల్లో ఘోరంగా చతికలపడ్డా కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టింది .ఓటమి ఊహించిందే అయినా.. ఘోర పరాజయానికి రాహుల్‌ సలహా బృందమే కారణమని సీనియర్లు మండిపడుతున్నారు. కీలక బాధ్యతల్లో ఉన్న యువనేత అనుచరులను దూరంగా ఉంచాలని పేర్కొంటున్నట్లు సమాచారం.

ఐదేళ్లు ప్రభుత్వ విధానాలపై సూటి విమర్శలు చేసేందుకు ప్రజలకు చేరువయ్యేందుకు మీడియా విభాగంపై దృష్టి సారించారు. అధికార ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పార్టీ విధానాలను జనాల్లోకి తీసుకెళ్లే విధంగా సీనియర్లకు ఆ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. ప్రభుత్వంలో అనుభవమున్న జైపాల్‌రెడ్డిని ఈ పదవికి ఎంపిక చేసే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. 2004కు ముందు పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా ఆయన పోషించిన పాత్రను పార్టీ పెద్దలు గుర్తు చేస్తున్నారు.

జైపాల్‌ రెడ్డికి మీడియాతో మంచి సంబంధాలున్నాయి. సీనియర్‌ నాయకుడు కావడంతో అధికార ప్రతినిధులను సమన్వయం చేసుకోవడం ఆయనకు పెద్ద కష్టం కాదు. కేంద్ర మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఆయనకుంది. విధానపరమైన అంశాలపై చక్కటి వాగ్దాటితో ప్రత్యర్ధులపై విరుచుకపడతారన్న పేరుంది.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జైపాల్‌రెడ్డికి మీడియా, సమాచారం, ప్రచారం విభాగాల బాధ్యతలు అప్పగించాలని సోనియా నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక ఆయనను రాజ్యసభకు పంపే యోచనలో పార్టీ ఉందని ఏఐసీసీ వర్గాలంటున్నాయి.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించిన జైపాల్ రెడ్డికి కొత్త పగ్గాలు ఇస్తే.. ఫలితం అనుకూలంగా వస్తుందా అని ..కొంతమంది నాయకులు అంటున్నారు. జైపాల్ రెడ్డి చేతిలో పగ్గాలు ..కాంగ్రెస్ పార్టీటి ఎంత దూరం తీసుకువెళతాయో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles