Kcr objections on the ordinance passed on polavaram

KCR objections on ordinance, Ordinance passed on Polavaram, Polavaram Project design objected by KCR, Telangana bandh protesting Polavaram design, Ordinance passed by President objected by KCR

KCR objections on the ordinance passed on Polavaram project

ఆర్డినెన్స్ మీద కెసిఆర్ అభ్యంతరాలు ఇవి!

Posted: 05/29/2014 09:26 AM IST
Kcr objections on the ordinance passed on polavaram

పోలవరం ప్రాజెక్ట్ మీద బుధవారం కేంద్ర కేబినెట్ లో జరిగిన తీర్మానాన్ని గుప్తంగానే ఉంచినా, అందులోని సారాంశాన్ని పసిగట్టిన తెలంగాణా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలపటాన్ని వ్యతిరేకిస్తున్నామని, అదే జరిగితే తెలంగాణాలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.  

కానీ అర్డినెన్స్ రానేవచ్చింది, కెసిఆర్ బంద్ పిలుపునిచ్చారు.  రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసుకున్న ఆర్డినెన్స్ మీద అభ్యంతరాలు తెల్పుతూ కెసిఆర్ రాష్ట్రపతికి రాసిన లేఖలో సారాంశం ఇది-

1.ఆర్డినెన్స్ అప్రజాస్వామికం.  భారత రాజ్యాంగం ఆర్టికిల్ 3 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొంది, తెలంగాణా 29 వ రాష్ట్రంగా ఏర్పడింది.  జూన్ 2 ను అప్పాయింటెడ్ డే గా తీర్మానం చెయ్యటం జరిగింది.  ఆ మేరకు గెజిట్ లో నోటిఫికేషన్ వెలువడింది.  అలా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్ర ఎల్లలు మార్చగల అధికారం కేవలం తెలంగాణా రాష్ట్రానికే ఉంది.  పార్లమెంటుకు కూడా లేదు.  రాష్ట్రంలోని చట్టసభలతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం తన ఇష్టమొచ్చినట్లుగా రాష్ట్ర సరిహద్దులను మార్చటం రాజ్యాంగ విరుద్ధం.  ఈ విషయంలో సుప్రీం కోర్టు బొమ్మై కేసులో స్పష్టం చేసింది.  సరిహద్దులలో మార్పులు తేవాలంటే తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శాసన సభలకు పంపించి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవాలి.  ఆ తర్వాతనే పార్లమెంటులో ఆమోదం పొందాలి.  ఇది రాజ్యాంగంలో పొందుపరచిన నియమం.  

2. గిరిజన ప్రాంతాలు ముంపుకి గురౌతున్నాయి.  అలా కాకుండా ఉండాలంటే పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ ని మార్చాలి.  

3. పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుత డిజైన్ వలన 460 మెగావాట్ల హైడల్ ప్రాజెక్ట్ ఆంధ్రాకు వెళ్ళిపోతుంది.

4. ముంపు వలన తెలంగాణా ప్రాంతమే కాకుండా ఒడిశా, ఛత్తీస్ గఢ్ లకు కూడా నష్టం కలుగుతోంది.

పోలవరం విషయంలో చట్టబద్ధంగా చర్యలు తీసుకునేలా చూడండి అన్న కెసిఆర్, పోలవరం విషయంలో తెలంగాణాకు అన్యాయం జరగటాన్ని సహించమని తేల్చి చెప్పారు.  ఈ విషయంలో కెసిఆర్ రాష్ట్ర గవర్నర్ ని కూడా కలిసి మాట్లాడారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles