Kcr welcomes chandrababu to visit war room

kcr welcomes chandrababu war room, babu to visit war room, kcr welcomes babu to visit war room, K Chandrasekhar Rao, Chandrababu Naidu, Mahanadu 2014.

kcr welcomes chandrababu to visit war room, KCR welcomes TDP chief to war room,

బాబు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? కేసిఆర్

Posted: 05/28/2014 08:10 AM IST
Kcr welcomes chandrababu to visit war room

కొత్త రాష్ట్రాలు, కొత్త ముఖ్యమంత్రులు, కొత్త హామీలు.. పాత ప్రజలు, పాత ప్రయోగాలు, పాత మాటలు, ఇవే ఇప్పటి రాజకీయ నాయకుల మద్య కనిపిస్తున్నాయి. కొత్తగా ప్రజలకు ఏదైన చెయ్యలనే ఆలోచన ఏ రాజకీయ నాయకుడికి లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు .. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి సరికొత్తగా ఆలోచించి, కాంగ్రెసోళ్ల బాటలోనే.. నడిసిండు. గదే.. ఆయన తెలంగాణ భవన్ లో.. కొత్తగా తెలంగాణ ప్రజలకు వార్ రూమ్ పేరు పరిచయం చేసిండు.

దీంతో పాత రాజకీయ నాయకుడైన .. సైకిల్ గుర్తు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు షాక్ తిని .. వార్ రూమ్ పై కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మన కేసిఆర్ సారు.. చంద్రాబాబు భలే ఆఫర్ ఇచ్చాడు, ‘‘ బాబు.. నువ్వు నా వార్ రూమ్ కు వస్తానంటే ..నేను వద్దంటానా?’’ అంటూ కేసిఆర్ ఆహ్వానించారు.. అంటే ‘‘వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి కాబట్టి ..గది మన కేసిఆర్ లెక్క. . 

అసలు 'వార్ రూమ్' అంటే మరేదో కాదని సమాచారాన్ని భద్రపరిచే కంప్యూటర్లు, ఆపరేటర్లతో కూడిన గదిగా టిఆర్ఎస్ అధినేత ప్రకటించారు. వార్ రూమ్‌ను చూడ్డానికి చంద్రబాబును అనుమతిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా "స్వాగతం పలుకుతాం.. ఘన స్వాగతం పలుకుతాం" అని కేసీఆర్ బదులిచ్చారు.

వార్ రూమ్ ఏర్పాటు సీమాంధ్ర ప్రాంతంలో ప్రకంపనాలు సృష్టించింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులను హైదరాబాద్ నుంచి పంపించి వేయడానికే వార్ రూమ్ ఏర్పాటు చేశారనే భావన సర్వత్రా నెలకొంది. కాగా సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు కొత్తగా ఏర్పాటు కానున్న సీమాంధ్ర రాష్ట్రంలో పనిచేయాలని కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ఒక ప్రకటన చేశారు.

అయితే చంద్రబాబు తెలంగాణ భవన్ లోఏర్పాటు చేసిన కేసిఆర్ వార్ రూమ్ వెళ్లతాడా లేదా అనేది ఈ రోజు మహనాడులో బయటపడుతుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles