Ganga cleansing responsibility given to uma bharati

Ganga cleansing responsibility given to Uma Bharati, BJP promises to cleanse Ganga, Modi promise to cleanse Ganga, River Waters and Ganga cleaning given to Uma Bharati

Ganga cleansing responsibility given to Uma Bharati

పవిత్రమైన గంగమ్మ ప్రక్షాళన బాధ్యత ఉమా భారతికి

Posted: 05/27/2014 09:58 AM IST
Ganga cleansing responsibility given to uma bharati

కాలుష్యం, అక్రమ ఇసుక తవ్వకాలు ఇవీ గంగమ్మ తల్లిని అపరిశుభ్రంగా చేస్తున్నవి.  ఒకసారి మునిగితే చాలు కోటి పాపాలు నశిస్తాయని హిందువులు విశ్వసించే గంగానది పుట్టిన స్థలం గంగోత్రి నుంచి సాగరసంగమం వరకు ప్రక్షాళన చెయ్యటం భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానం.  అందులో భాగంగా ఉమా భారతి ఆ సమయంలో ఉద్యమించారు.  

అందువలన, కేంద్రంలో మంత్రి వర్గంలో చేరిన ఉమాభారతికి గంగానది ప్రక్షాళనా బాధ్యతను అప్పగించటం జరిగింది.  2011 నుంచే గంగమ్మతల్లి పిలుస్తోంది అన్న నినాదంతో సోనియా గాంధీ దగ్గర ఈ ప్రక్షాళన ప్రస్తావనను తీసుకునివచ్చారామె.   సేవ్ గంగా అని పిలుపునిచ్చారు.  నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో కూడా గంగానది ప్రక్షాళన అవసరాన్ని గురించి చెప్తూ, ఆ పని తాము చేస్తామని వారణాసి వాసులకు మాటిచ్చారు.

మంత్రుల పోర్ట్ ఫోలియోస్ ని అధికారికగా ఇంకా వెల్లడి చెయ్యలేదు కానీ ఉమా భారతి మాత్రం తనకు దక్కిన జలవనరులు, గంగా ప్రక్షాళన బాధ్యతలను తనకు అప్పగించారంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసి, అలా ముందుగా తెలియజేయటం సరికాదని, ప్రోటోకాల్ ఉల్లఘన అవుతుందని గ్రహించి, ఆ తర్వాత ఆమె దాన్ని తొలగించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles