Telangana flag hoisting on june 2nd in all villages

Telangana flag hoisting on june 2nd in all villages, TJAC chairman appointment denied by KCR, Telangana celebrations from 1st June midnight

Telangana flag hoisting on june 2nd in all villages

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం పల్లెపల్లెలో పతాకావిష్కరణ

Posted: 05/23/2014 05:24 PM IST
Telangana flag hoisting on june 2nd in all villages

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేసుకోవాలని, పల్లెపల్లెలో పతాకావిష్కరణ జరగాలని తెలంగాణా ఐకాస ఛైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు.  జూన్ 1 అర్ధరాత్రి నుంచే హైద్రాబాద్ గన్ పార్క్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని ఆయన తెలియజేసారు.  ఉద్యోగులంతా ఆ రోజు అమరవీరులకు నివాళులర్పించి ఆ తర్వాతనే ఫైళ్ల మీద సంతకాలు చెయ్యటానికి నిర్ణయం జరిగింది.  

తెలంగాణా పునర్నిర్మాణంలో తెలంగాణా ఐకాస పాత్ర తప్పక ఉంటుందని కోదండరామ్ స్పష్టం చేసారు.  కోదండరామ్ కి కెసిఆర్ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని వస్తున్న వ్యాఖ్యలు సరైనవి కాదని, కెసిఆర్ తనవాడేనని, ఎప్పుడైనా కలవగలుగుతానని కోదండరామ్ తెలియజేసారు.

ఘనంగా జరపుకోవాలని కోరుకుంటున్న తెలంగాణా ఆవిర్భావ దినాన్నే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సరైన రోజుగా కెసిఆర్ భావిస్తున్నారు.  కోదండరామ్ ని కలవటం విషయంలో కెసిఆర్ ఎటువంటి కామెంట్ చెయ్యలేదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles