High demand in godavari pushkaram posts

godavari pushkaralu 2015, high demand in godavari pushkaram posts, godavari pushkaram, CM Chandrababu naidu, PM Narendra modi, Rajahmundry, government jobs, government employs,

high demand in godavari pushkaram posts, godavari pushkaralu in rajahmundry 2015

గోదావరి పోస్టులకు ఉద్యోగులు పరుగులు!

Posted: 05/23/2014 11:00 AM IST
High demand in godavari pushkaram posts

గోదావరి పుష్కరాలు పుణ్యమా అని రాజమండ్రిలోని (గోదావారి) కొన్ని కీలకమైన పోస్టులకు ఎక్కడలేని డిమాండ్ వచ్చిపడుతోంది. 2015 జూలై 14 నుండి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్న సంగతి విదితమే. పుష్కరాల్లో గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఎక్కడ పుణ్యస్నానం చేసినా ఒకే ఫలితం ఉన్నప్పటికీ, దేశం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులంతా రాజమండ్రికే తరలి వస్తుంటారు.

అందువల్ల గోదావరి పుష్కరాలు పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది రాజమండ్రి నగరమే. దాంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు రాజమండ్రి నగరంపైనే దృష్టికేంద్రీకరిస్తారు. 2003లో జరిగిన పుష్కరాలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సుమారు రూ.100కోట్లు ఖర్చుపెట్టినట్టు అంచనా. రానున్న 2015 పుష్కరాలకు కూడా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు భారీగానే నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

అందులోనూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండటం, రాష్ట్రంలో తెలుగుదేశం-బిజెపి కూటమి అధికారంలో ఉండటంతో గోదావరి పుష్కరాలకు గతం కన్నా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి బిజెపి ఎమ్మెల్యే ప్రాతినిధ్యంవహిస్తుండటంతో మరింత ప్రాధాన్యత ఏర్పడనుంది. అంటే గోదావరి పుష్కరాల ఏర్పాట్లతో సంబంధం ఉన్న అన్ని శాఖలకు భారీగానే నిధులు మంజూరవుతాయన్న మాట.

ఇదే ఇపుడు రాజమండ్రిలోని వివిధ శాఖల పోస్టులకు విపరీతమైన గిరాకీని తెచ్చిపెడుతోంది. గోదావరి పుష్కరాల సమయంలో పనిచేస్తే అంతో ఇంతో వెనకేసుకోవచ్చన్న ఆశతో రాజమండ్రిలోని వివిధ శాఖల పోస్టుల కోసం అప్పుడే కొంత మంది అధికారులు కొత్తగా గెలిచిన ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు.


ఇంకా ప్రమాణస్వీకారం కూడా చేయకపోయినప్పటికీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులవుతామన్న ధీమాతో ఉన్న ఎమ్మెల్యేలను ప్రసన్నంచేసుకునే పనిలో ఉన్నారు. కొత్త ఎమ్మెల్యేలు కూడా అప్పుడే తమ నియోజకవర్గంలో తమకు అనుకూలంగా పనిచేసేందుకు అనుకూలంగా ఉన్న అధికారుల కోసం వేట మొదలుపెట్టారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles