Manmohan singh submits his resignation to president

Manmohan Singh submits resignation, Manmohan Singh life open book, Manmohan Singh accepts judgment of people of the nation

Manmohan Singh submits his resignation to President

దేశ విభజనలో బాధితుడు దేశ అత్యున్నత స్థానంలో

Posted: 05/17/2014 12:14 PM IST
Manmohan singh submits his resignation to president

ఈ రోజు ఆఖరి సమావేశంలో ఆఖరిసారిగా ప్రధానమంత్రిగా మాట్లాడిన మన్మోహన్ సింగ్, దేశ విభజన సమయంలో బాధితుడిగా అల్పసంఖ్యాక వర్గంలో ఉన్న తనను దేశంలో అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టి దేశ బాధ్యతలను రెండు పర్యాయాలు ఇచ్చిన భారతవాసులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు.  

నేను ఎప్పుడూ చెప్తూ వస్తున్నట్లుగానే తన జీవితం ఒక తెరిచిన పుస్తకమని, తనెప్పుడూ దేశ సౌభాగ్యంలో పనిచెయ్యటానికే పూర్తి ప్రయత్నం చేసానని అన్నారు మన్మోహన్ సింగ్.  ఈసారి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిన సందర్భంగా దేశవాసుల తీర్పును శిరసావహిస్తున్నానని ఆయన అన్నారు.  

గతంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వస్తే దేశానికి అరిష్టమేనంటూ వ్యాఖ్యానించారు.  కానీ ఇప్పుడు ప్రజాతీర్పు జరిగిపోయింది కాబట్టి, వచ్చే ప్రభుత్వం తమ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుని దేశాన్ని ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.  

ఈరోజు దూర్ దర్శన్ లో ప్రసంగించిన తర్వాత పదవి నుంచి దిగిపోతున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆఖరి క్యాబినెట్ మీటింగ్ లో తనతో పనిచేసిన మంత్రి వర్గాన్ని సంబోధించి మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ కి వెళ్ళి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తన రాజీనామాను సమర్పిస్తారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles