నరేంద్ర మోడీ, నమో , ఛాయ్ వాలా అనే పధాలు ఇటీవల దేశంలో బాగా వినిపిస్తున్నాయి. చదుకున్న వ్యక్తి నుండి.. చదువు రాని వ్యక్తి వరకు .. అందరి నోట.. నరేంద్ర మోడీ, నమో, ఛాయ్ వాలా అనే పేరు బాగా వినిపిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు..నమో మంత్రం పాకిపోయింది.
పట్టుదలకు ఆయన ప్రతీక. వ్యూహ రచనలో దిట్ట. నమ్మకస్థులకు ఎంత పెద్దపీట వేస్తారో ప్రత్యర్థులను అంతే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణచివేయటానికి ఏమాత్రం జంకరు. సంఘ్ ప్రచారక్ స్థాయి నుంచి దేశ ప్రధానిగా అంచెలంచెలుగా ఎదిగిన నరేంద్ర మోదీ ప్రస్థానంలో అనేక ప్రత్యేకతలున్నాయి.
గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టటానికి ముందు ఆయన అశోకా రోడ్డులోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక చిన్న గదిలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అధికార ప్రతినిధిగా అప్పుడప్పుడూ మీడియాతో ఆచితూచి మాట్లాడేవారు. అప్పట్లో పార్టీ అగ్రనాయకులైన వాజపేయి, అద్వానీల అండతో తమకెదురు లేదని వ్యవహరించిన అనేక మంది నాయకులు మోదీని పట్టించుకునేవారు కారు.
ఇప్పుడు వీరు గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తుపై బెంగ పడాల్సి వస్తోంది. ప్రత్యర్థులను నిర్దాక్షిణ్యంగా అణచివేసే మోదీ ధాటికి ఆయన పాత ప్రత్యర్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయి. క్షమించే అలవాటు మోదీలో ఏ కోశానా కనిపించదని ఆయన సన్నిహితులే అంగీకరిస్తారు. బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపికైనప్పటి నుంచి ఆయన అత్యంత పకడ్బందీగా ఎన్నికలలో విజయం సాధించటానికి అవసరమైన వ్యూహానికి రూపకల్పన చేసి తు.చ తప్పకుండా అమలు చేశారు.
{besps}narendramodipm{/besps}
మోదీ రాకతో పార్టీలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి మోదీ తమకు అందనంత స్థాయికి ఎదిగేంత వరకూ ప్రతి ఒక్క విషయంలో తన అధిపత్యాన్ని నిరూపించుకున్న అద్వానీ సైతం పక్కకు వైదొలగాల్సి వచ్చింది. మురళీ మనోహర్ జోషీ వంటి కరుడుకట్టిన అతివాదులు సైతం మౌన మునులైపోయారు. గుజరాత్లో మతకలహాలు ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎసరుపెట్టే సమయంలో అద్వానీ, జైట్లీతోపాటు దివంగత ప్రమోద్ మహాజన్ అప్పటి ప్రధాని వాజపేయిని ఒప్పించి పదవీ గండం లేకుండా చూశారు.2002 తరువాత మోదీ గుజరాత్‌ను తన సొంత రాజ్యంగా మార్చుకున్నారు.
గుజరాత్ అభివృద్ధిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోప్రచారం చేసి పెట్టుబడులను సాధించారు. గుజరాత్ నమూనా అభివృద్ధిపై దేశాన్ని ఆకర్షించటంలో విజయం సాధించారు. బిజెపిని గెలిపించటానికి ఆయన అవిశ్రాంతంగా దేశ వ్యాప్తంగా పర్యటించారు. నాలుగు వందలకు పైగా ర్యాలీల్లో పాల్గొన్నారు. పార్టీ బలంగా లేని ప్రాంతాలలో కూడా పర్యటించారు.
ఆయన సుమారు మూడు లక్షల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించటమే కాక ఫేస్ బుక్, ట్విట్టర్‌తో ప్రజలను పలకరించారు. చాయ్ వాలాగా జీవితాన్ని ప్రారంభించిన మోడీ చాయ్‌వాలాపై చర్చలో సుమారు యాభై లక్షల మందితో ఆయన మాట కలిపారు. ప్రచారానికి బయలుదేరే ముందు ఆయన కాంగ్రెస్‌పై సంధించవలసిన విమర్శలపై సమగ్ర వివరాలను తెలుసుకునేవారు. తాను పర్యటించే ప్రాంతంలోని ప్రజలతో మమేకమయ్యే విధంగా ఆయన చేసిన ప్రసంగాలు మంచి ఫలితాలను సాధించి పెట్టాయి.
2014 సార్వత్రిక ఎన్నికలు మన దేశానికి మరో కొత్త ప్రధానిని అందించాయి. ఆధునిక మెస్సయ్యగా తనకు తాను అభివర్ణించుకున్న గుజరాత్ మృత్యుబేహారి నరేంద్రమోడీ దేశ అత్యున్నత ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్నారు. అవును! నరేంద్రమోడీ మన దేశానికి కొత్త ప్రధాని'గా వ్యవహరించనున్నారు. 1947 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా పరాజయం పాలవడం దేశ ఎన్నికల చరిత్రలో ఇదే తొలిసారి.
భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి చూపిస్తామని బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈరోజు వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ఆయన వడోదరాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.భారత్ మాతాకు జై అంటూ నరేంద్ర మోడీ.. భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. బీజేపీ విజయానికి కృషి చేసిన భాగస్వాములందరికీ ధన్యవాదాలు అన్నారు.
భారతదేశం మొత్తం తనపై అభిమానం కురిపించిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమపై విశ్వాసం ఉంచారని, ఆ విశ్వాసాన్ని నిజం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రచారం చేయాల్సి ఉన్నందున, వడోదరా నియోజకవర్గంలో తాను కేవలం 15 నిమిషాలు మాత్రమే గడపగలిగానని, అయినా ఐదు లక్షల ఓట్లతో ప్రేమను కురిపించారని ఆయన తెలిపారు. అది తన గుండెల్లో నిరంతరం ఉంటుందని మోడీ తెలిపారు.
భారత ప్రజాస్వామ్యంలో తనలాంటి వ్యక్తికి ప్రధాని అయ్యే భాగ్యం కలిగిందని, అదే భారత దేశం గొప్పదనమన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఐదు లక్షల ఓట్ల మెజారిటీ ఎవరికీ దక్కలేదని, ఆ రికార్డు నెలకొల్పి తన పేరు చరితార్థం చేశారని ఆయన అన్నారు. ఈ రోజు ఎలా గడిచింది? అంటూ తన మద్దతుదారులను ఆయన ప్రశ్నించారు. చాలా ఉద్విగ్నంగా గడిచిందని ఆయనే సమాధానం చెప్పారు.
బీజేపీపై నమ్మకముంచి దేశ ప్రజలకు ధన్యవాదాలు అని కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నేటి నుంచి మన కష్టాలకు ముగింపు పలుకుదామని అన్నారు. బీజేపీపై నమ్మకముంచిన ప్రజలందరికీ నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
దేశ ప్రజలు భారతీయ జనతాపార్టీ కూటమికి ఘన విజయాన్ని అందించారు. ఢిల్లీ పీఠం మీదకి నరేంద్రమోడీని సాదరంగా ఆహ్వానించారు. ఈనెల 21వ తేదీన నరేంద్రమోడీ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నరేంద్రమోడీ గెలుస్తారన్న వార్తలు రాగానే ఆయనకు, ఆయనకి సంబంధించిన అందరికీ కేంద్ర బలగాలు ఆటోమేటిగ్గా పెరిగాయి.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more