తొమ్మిది సంవత్సరాలు ఆంద్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా, పది సంవత్సరాలు ప్రతిపక్షనేతగా తెలుగు ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్న ఏకైక నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు దీటుగా తయరుచేసిన ఘనత నారా చంద్రబాబు. తొమ్మిది సంవత్సరాలు తెలుగుప్రజలకు సుస్థిరపాలన అందించి, ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. పాపం బాబు పై ఎవరి కన్ను పడింది గానీ, పది సంవత్సరాలు రాజకీయ పదవి దూరంగా ఉండి కూడా తెలుగు ప్రజలు సేవాల అందించారు. అడ్డదారిలో అవినీతి నాయకులు ..అధికారం సంపాదించుకున్నప్పటికి, కుంగిపోకుండా, నిరాశ పడకుండా , తెలుగు రాష్ట్రాన్ని అభివ్రుద్ది చేయటం ఆయన కంకణంగా పెట్టుకున్నారు.
అందుకు 64ఏళ్లు వయసులో కూడా .. అలుపెరుగని వీరుడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయటం జరిగింది. ఒక రైతు బిడ్డగా రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయాడు. కాంగ్రెస్ పాలన పదేళ్లు తెలుగు ప్రజలు అనుభవించిన నరకం అంత ఇంత కాదు. చంద్రన్న దీపం పధకం పెట్టి, తెలుగింటి ఆడబిడ్డ కష్టం తీర్చినాడు, బాబు పెట్టిన దీపం కాంగ్రెస్ ప్రభుత్వంలో.. ఖారీదైపోయింది. ఒక గ్యాస్ బండ 1400 ధర పలికింది. ప్రతి ఇంటిలో నిత్యం అవరసం అయిన ఉల్లిపాయ..కిలో 100రూపాయలు పలికింది. అలాంటి సమయంలో తెలుగు ప్రజలు అల్లాడిపోయినప్పుడు చంద్రబాబు మనసు విలవిలాడింది. నా తెలుగు ప్రజలకు ఇన్ని కష్టాలు తెచ్చిన కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ఆయన ద్వేయంగా పెట్టుకున్నారు.
చంద్రబాబు గతంలో చేసిన తప్పులు తెలుసుకోని, ప్రజల ముందుకు వచ్చి, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకు సాగిపోయాడు. రాష్ట్ర విభజన ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఘోరమైన తప్పు చేసిన విషయం తెలిసిందే. తెలుగు ప్రజలు రెండు వర్గాలు విడిపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఢిల్లీలో విందు చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ కి బుద్ది చెప్పటానికే.. బిజేపి తో బాబు కలిసిపోయాడు.
టిడిపి, బిజేపిల బలనికి.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ సపోర్టు దక్కటంతో, ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు నిద్రలేకుండా పోయింది. అప్పటి వరకు టిడిపి గెలుపు అంటే.. పెదవిరిచిన వారు సైతం ..అవాక్కు అయ్యే విధంగా చంద్రబాబు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ సమాధానం ఇవ్వటం జరిగింది. కాంగ్రెస్ పాలన జరిగిన అవినీతి పై తెలుగు ప్రజలకు వివరించటం జరిగింది. దీంతో సీమాంద్ర ప్రాంతాన్ని ఎవరు అభివ్రుద్ది చేస్తారో, సీమాంద్ర ప్రజలకు ఏ రాజకీయ పార్టీ న్యాయం చేయగలదో.. గ్రహించి, సీమాంద్ర ప్రజలు తమ ఓటు హక్కుతో చంద్రబాబును ఎన్నుకోవటం జరిగింది. సీమాంద్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గా చరిత్రలో నిలిచిపోయింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటుకు సాధారణ మెజార్టీ తెలుగుదేశం పార్టీ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన శాసనసభ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. రాజధాని లేని రాజ్యాన్ని .. చంద్రబాబు చేతిలో సీమాంద్ర ప్రజలు పెట్టారు. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా సీమాంద్ర ప్రాంతాన్ని ఎలా అభివ్రుద్ది చేస్తారో చూద్దాం, సీమాంద్ర ప్రజలకు ఈ ఐదు సంవత్సరాలలో ఎలా న్యాయం చేస్తారో చూద్దాం.
కొసమెరుపు : అధికారం మేం ఇచ్చాం.. అభివ్రుద్ది మీరు చేయ్యండని ..చంద్రబాబును సీమాంద్ర ప్రజలు కోరుతున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more