Chandrababu reiterates farm loan waiver

Chandrababu first signature farmer loan waiver, Chandrababu reiterates farm loan waiver, TDP win in seemandhra assured, TDP winning Parishats in Seemandhra

Chandrababu reiterates far loan waiver

రైతు ఋణమాఫీకే నా తొలి సంతకం- బాబు

Posted: 05/14/2014 11:15 AM IST
Chandrababu reiterates farm loan waiver

తెలుగు దేశం పార్టీ పరిషత్ ఎన్నికల ఫలితాలలో విజయాలు సాధించి గట్టి పోటీ అనుకున్న వైయస్ ఆర్ కాంగ్రెస్ ని వెనక్కి నెట్టివేసిన సందర్భంగా సార్వత్రిక ఎన్నికలలోనూ తెలుగు దేశం ప్రభంజనం సృష్టిస్తుందని, రాష్ట్రంలో అధికారం సంపాదిస్తుందని విశ్వసిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసే మొదటి సంతకం రైతు ఋణాల మాఫీ మీదనేనని పునరుద్ఘాటించారు.

తెదేపా ఎన్నికల హామీలలో ఒకటైన రైతుల ఋణ మాఫీ ఆచరీణం కాదని వైయస్ ఆర్ కాంగ్రెస్ విమర్శించింది.  అయితే చంద్రబాబు అది ఎలా సాధ్యమౌతుందో తనకి తెలుసని, రైతులు, మహిళల డ్వాక్రా ఋణాలను మాఫీ చేస్తానని చెప్తూ వచ్చారు.  

వ్యవసాయానికి తన ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని చంద్రబాబు నాయుడు తెలియజేసారు.  గోదావరి ప్రాంతాలను వ్యవసాయ క్షేత్రంలోను, నెల్లూరు ప్రాంతాన్ని పారిశ్రామక క్షేత్రంలోనూ గణనీయమైన అభివృద్ధి సాధించేట్టుగా చేస్తానని చంద్రబాబు ఎన్నికల హామీల్లో తెలియజేసారు.  అవినీతిని అంతమొందిస్తానని కూడా మాటిచ్చారు చంద్రబాబు.  

వాటిలో ముందుగా రైతు ఋణాలను మాఫీ చేస్తానని, అదే తన తొలి సంతకమని చంద్రబాబు మరోసారి హామీ ఇచ్చారు.  ఎన్నికల ముందు ఇచ్చిన మాట కంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన మాటకే ఎక్కువ విలువుంది.  ఎందుకంటే ఎన్నికలు అయిపోయి వోటర్లు తమ అభిమతాన్ని ఇవిఎమ్ లలో నిక్షిప్తం చేసివుంచారు కాబట్టి, ఇప్పడు చంద్రబాబు చేసే వాగ్దానాల వెనక రాజకీయ ప్రయోజనం కనపడదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles