Pak asked indian journalists go leave country

Pakistan asked Indian Journalists go leave country, Hindu and PTI journalists in Pakistan, Indian Journalists visa expiry in Pakistan

Pakistan asked Indian Journalists go leave country in a week

పాక్ నుంచి వెళ్ళిపోండి- భారత జర్నలిస్ట్ లకు ఆదేశం

Posted: 05/10/2014 06:04 PM IST
Pak asked indian journalists go leave country

భారత్ పాక్ దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఇరు దేశాల నుంచి ఒకరి దేశ రాజధానిలో మరొక దేశ నుంచి ఇద్దరు జర్నలిస్ట్ లను నియమించుకోవచ్చు.  ఆ విధంగా భారత్ నుంచి లభించిన పాకిస్తాన్ వీసా మీద ద హిందూ తరఫునుంచి మీనా మీనన్, పిటిఐ నుంచి స్నేహేష్ అలెక్స్ ఫిలిప్ ఆగస్ట్ 2013 లో పాకిస్తాన్ వెళ్లారు.  మూడు నెలలకోసారి వాళ్లు వీసా రెన్యువల్ కి దరఖాస్తు పెట్టుకోవలసి ఉంటుంది కాబట్టి అలాగే చేస్తూ వచ్చారు.  

మార్చి 9 న వీసా గడువు ముగిసే ముందుగానే ఆ ఇద్దరు పాత్రికేయులూ రెన్యువల్ కోసం అప్లై చేసారు.  గడువు ముగిసేంత వరకూ ఏ సమాధానమూ రాలేదు.  ఆ తర్వాత వీసా ప్రక్రియ కొనసాగుతోందంటూ సమాధానం వచ్చింది.  ఆ తర్వాత సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాయగానే సమాధానమేమీ రాలేదు కానీ తాజాగా వీసా గడువ అయిపోయి రెండు నెలలైంది కాబట్టి వారం రోజులలో దేశాన్ని విడిచి పొమ్మంటూ ఆ మంత్రిత్వ శాఖనుంచి ఉత్తర్వు వచ్చింది.  

ఇద్దరు పాత్రికేయులను ఒకరి దేశానికొకరు పంపించుకునే వెసులుబాటు ఇరు దేశాల మధ్య చేసుకున్న ఒప్పందం కలిగిస్తున్నా, పాకిస్తాన్ నుంచి మాత్రం పాత్రికేయులెవరూ భారత్ కి వీసా మీద రాకపోవటం విశేషం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles