Betting started on parties coming to power in seemandhra

Betting started on Parties coming to power in Seemandhra, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014

Betting started on Parties coming to power in Seemandhra

ఎన్నికలైపోవటంతో ఇక బెట్టింగ్ మొదలు!

Posted: 05/09/2014 10:08 AM IST
Betting started on parties coming to power in seemandhra

ఎన్నికలు అయిపోయాయి కదా, ఫలితాలు ఇవిఎమ్ లలో భద్రంగా ఉన్నాయి, అవి మే 16 కి వెల్లడౌతాయి.  కానీ ఈలోపులో బెట్టింగ్ లకు మంచి వ్యవధి దొరికింది.  ఈ బెట్టింగ్ ల జోరు పశ్చిమ గోదావరి జిల్లాలో అధికంగా కనిపిస్తోంది.  

ప్రముఖంగా బెట్టింగ్ తెదేపా గెలుస్తుందా లేక వైకాపా అన్నదానిమీదనే ఉంది.  ఇంకా లోతుగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నదానిమీద కూడా పందేలు జరుగుతున్నాయి కాని అవి తక్కువగానే ఉన్నాయి.  ఈ ఒక్క జిల్లాలోనే కేవలం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నదానిమీద కాసిన పందేలు 100 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.  మూడు నుంచి ఐదు రెట్ల వరకు పందేలు సాగుతున్నాయి.  తరువాతి స్థానం రాయలసీమలోని నాలుగు జిల్లాలలది.  నాలుగు జిల్లాలలో కలిపి 30 కోట్ల వరకు పందేలు సాగుతున్నాయని అంచనా.  వైయస్ జగన్, విజయమ్మ గెలుపు, మెజారిటీల మీద అధికంగా పందేలు కాస్తున్నారు.

ఎన్నికలయ్యేంత వరకు విరివిగా ఖర్చుపెడుతూ తమ మీద తామే పందెం కాసుకున్న రాజకీయ నాయకులు ఫలితాల కోసం ఎదురుచూస్తుంటే, ఇప్పుడు ప్రజల వాళ్ళ మీద పందేలు కాస్తున్నారు.  ఎన్నికలలో డబ్బు చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత.  

ఎన్నికల ప్రచార సాధనాలు, సామగ్రి, ఏర్పాట్లు, రవాణా, భోజన సదుపాయాలు, ఇవి కాక వోటర్లకు డబ్బు పంచడాలు, బహుమానాలు ఇవ్వటాలు- ఈ ఏర్పాట్లను చూసేవారు తృణమ పణమో మిగిల్చుకోవటాలు, అభ్యర్థులు పెట్టే ఖర్చులో వెనకేసుకునేవారు, పెట్రోల్ డీజిల్ డీలర్లు, ఇక ఈ సారి ఎన్నికలలో బాగా ఖర్చుపెట్టింది విమానాలు, హెలికాప్టర్ల మీద.  ఇలా ఖర్చు పెట్టేవాళ్ళు రాజకీయ పందేలుగా పెడుతుంటే అందులో లాభపడ్డవాళ్ళు చిలక్కొట్టుడు కొట్టేవాళ్ళు ఉంటారు.  అలా వెనకేసుకున్న డబ్బును పందేలలో పెట్టేవారున్నారు.  వచ్చిందా కనీసం మూడురెట్లవుతుంది.  పోయిందా, తేరగా వచ్చిన సొమ్మే కదా అనుకునేవారూ ఉన్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles