Bjp protest at varanasi

BJP protest at Varanasi, Modi rally at Varanasi cancelled, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

BJP protest at Varanasi, EC criticized by BJP leaders

వారణాసిలో భాజపా నిరసన జ్వాల

Posted: 05/08/2014 04:31 PM IST
Bjp protest at varanasi

ఈరోజు పవిత్రమైన వారణాసి నగరం భాజపా నిరసన జ్వాలను చవిచూసింది.  భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ వారణాసిలో ఎన్నికల ప్రచార సభలను నిర్వహించనుండగా వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ వాటికి అనుమతినివ్వలేదు.  దానితో భాజపా నాయకులు అరుణ్ జైట్లీ, అమిత్ షా తో సహా ఎందరో కార్యకర్తలు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం దగ్గర ధర్నా చేసారు.  

భద్రతా సమస్యలను చూపించిన ఎన్నికల కమిషన్ మీద అరుణ్ జైట్లీ విమర్శల వర్షాన్ని కురిపించారు.  పక్షపాతంగా వ్యవహరించిన జిల్లా మేజిస్ట్రేట్ ను మౌనంగా సాక్షిలాగా చూస్తున్న ఎన్నికల కమిషన్ ని పిరికితనంగా ఆయన అభివర్ణించారు.  

నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన ఎన్నికల కమిషన్ అలా చెయ్యకపోవటం వలనే మా కార్యకర్తలు సత్యాగ్రహానికి దిగవలసివచ్చిందంటూ నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేసారు.  అయితే సంయమనాన్ని పాటించమని, వారణాసి ప్రజకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించవద్దని కార్యకర్తలకు ఆయన సూచించారు.  గంగమ్మతల్లికి హారతి ఇచ్చే మోదీ కార్యక్రమం ఈ రోజు జరగనందుకు ఆయన ఆవేదనను వ్యక్తం చేస్తూ తల్లి మమకారం రాజనీతిని మించినదంటూ తెలియజేసారు.  

అయితే ఎన్నికల కమిషన్ కూడా తన చర్యలను సమర్థించుకుంటూ కేవలం జిల్లా మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికనే కాకుండా యుపి ఛీఫ్ సెక్రటరీ, డిజిపి లను కూడా సంప్రదించి, భద్రతా సమస్య వలన అనుమతినివ్వలేదని అన్నారు. భద్రతా విషయంలో సంబంధిత అధికారుల సూచనలను కాదని అనలేము కదా అని అన్నారు.  

ఔనౌను రాహుల్ గాందీ రోడ్ షో సమయంలో లేని భద్రతా సమస్య బహిరంగ సభకు వచ్చింది అన్నారు జైట్లీ.  

వారణాసిలో జరిగిన ధర్నాలో డిఎమ్ యాదవ్ దిష్టిబొమ్మను తగులబెట్టి ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసారు.  దానితో బుధవారం సాయంత్రం ఐదు సభల్లో నాలుగిటికి ఆయన అనుమతినిచ్చారు.  ఇప్పుడు చాలా ఆలస్యమైందని, సమయం సరిపోదని వాటిని కూడా తిరస్కరించారు మోదీ.  

ఉత్తర్ ప్రదేశ్ లోని ఆజమ్ గడ్ లో మాట్లాడుతూ నరేంద్ర మోదీ, మూడు ఎన్నికలుగా చూస్తూవున్నాం, ఎన్నికల కమిషన్ పక్షపాతాన్ని చూపిస్తోందని అన్నారు.  ఇలా చేస్తూ, ఢిల్లీలో కూర్చుని తమకొచ్చే సీట్ల లెక్కలు వేసుకుంటున్న వారి అంచనాలను వోటర్లు తారుమారు చెయ్యకమానరని ఆయన విమర్శించారు.   దీని వలన తనకేదో నష్టం జరుగుతుందని, లోక్ సభ ఎన్నికల ఫలితాలలో మార్పు వస్తుందని అనుకుంటే అది వాళ్ళ తప్పే అవుతుందంటూ పరోక్షంగా యుపిఏ ప్రభుత్వాన్ని ఆయన ఎండగట్టారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles