Mulla periyar dam suit verdict in favour of tn

Mulla periyar dam suit verdict in favour of TN , Mulla periyar dam at TN Keral boarder, Supreme Court allows 142 feet water at Mulla periyar dam

Mulla periyar dam suit verdict in favour of TN

ముళ్ళ పెరియార్ నీటి మట్టం పెంచుకోండి- సుప్రీం

Posted: 05/07/2014 12:05 PM IST
Mulla periyar dam suit verdict in favour of tn

2006 లో కేరళ ప్రభుత్వం ముళ్ళ పెరియార్ డ్యామ్ భద్రత కోసం డ్యామ్ సేఫ్టీ అథారిటీని నియమించి తమిళనాడుకి కేవలం 136 అడుగుల నీటి మట్టానికి మాత్రమే అనుమతిస్తూ వస్తున్న చర్య రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ఈరోజు తీర్పు నివ్వటంతో సంవత్సరాలతరబడి తమిళనాడు, కేరళ సరిహద్దులో ఉన్న ఈ డ్యామ్ విషయంలో రాజుకుంటున్న గొడవలకు ఫుల్ స్టాప్ పడింది  

ఐదుగురు జడ్జ్ లతో కూడిన ధర్మాసనం కేరళ ప్రభుత్వ జోక్యాన్ని శాశ్వతంగా లేకుండా చేస్తూ నీటి మట్టాన్ని 142 అడుగుల ఎత్తు వరకు పెంచుకునే అధికారం ఇచ్చింది.  

అంతేకాకుండా ప్రభుత్వం చట్టాలు చెయ్యగలిగే అధికారం కలిగివుంటుంది కానీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసే అధికారం ఉండదని, ముళ్ళ పెరియార్ విషయంలో కేరళ ప్రభుత్వం చట్టాన్ని చేస్తూ లోగడ చేసింది న్యాయస్థానం విషయాలలో జోక్యం చేసుకోవటం అవుతుంది కాబట్టి అది రాజ్యాంగ విరుద్ధమౌతుందని, ఆ చట్టం చెల్లదని కూడా తెలియజేసింది.

కేరళ ప్రభుత్వం భయపడుతున్నట్లుగా డ్యామ్ కి ప్రమాదం ఉన్నట్లయితే తమిళనాడు ప్రభుత్వాన్ని వాటికి మరమ్మతులు చేసి డ్యామ్ భద్రతను కాపాడటానికి అనుమతించవలసిందిగా ఆదేశించింది.

ఆ విధంగా 2006 లో తమిళనాడు వేసిన దావా మీద ఈ రోజు తమిళనాడుకి అనుకూలంగా తీర్పు వచ్చింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles