Bjp s win and nda s defeat jairam ramesh reckons

BJP's win and NDA's defeat Jairam Ramesh reckons, Elections 2014, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

BJP's win and NDA's defeat Jairam Ramesh reckons

భాజపా గెలుపు, ఎన్డియే ఓటమి- జైరాం లెక్కలు

Posted: 05/06/2014 11:04 AM IST
Bjp s win and nda s defeat jairam ramesh reckons

భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి వలన భాజపాకి అమితమైన మద్దతు లభించిందని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిచోట్లా అంగీకరించటం జరుగుతోంది.  అలా అంగీకరించటం వలన మానసిక సంసిద్ధత కలుగుతుందన్నది నిర్వివాదం.  కానీ పార్టీ శ్రేణులు నీరసపడిపోయి ఓడక ముందే, అంటే ప్రకటన జరగకముందే ఓటమిని అంగీకరించటం కూడా జరుగుతుంది.  దాన్ని అధిగమించటం కోసం ఆ ప్రకటనలలో కొంత ఉత్సాహాన్ని కూడా నింపాల్సి వస్తుంది.

పార్టీ గెలుస్తుందని నమ్మినప్పుడే పార్టీ శ్రేణులు చివరి వరకూ పోరాడుతారు.  అందువలన వోటమిని అంగీకరించిన కాంగ్రెస్ పార్టీ చేదు తెలియకుండా వాటికి తీపి పూత కూడా పూస్తోంది.  

శ్రీకాకుళంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన జైరాం రమేశ్ భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందనటంలో అనుమానం లేదనే విషయాన్ని అంగీకరిస్తూనే, ఎన్డియే కూటమికి మాత్రం మెజారిటీ రాదని, అందువలన యుపిఏ ప్రభుత్వమే కేంద్రంలో అధికారాన్ని చేపడుతుందని తను వేసిన లెక్క చెప్పారు.  

అలాగే రాష్ట్రం విషయానికి వచ్చేసరికి, సీమాంధ్రలో కాంగ్రెస్ స్వయంకృతమే ఓటమికి కారణమవుతుందని, అందుకు సీమాంధ్ర నాయకత్వ లోపమే అసలు కారణమని అని శ్రీకాకుళంలో అన్న జైరాం రమేశ్ తర్వాత దాన్ని సమర్థించుకుంటూ, తన మాటలను మీడియా వక్రీకరించిందని,     పార్టీకి క్లిష్ట పరిస్థితి ఉన్నమాట వాస్తవమే కానీ, కాంగ్రెస్ పార్టీ ఎంత వేగంగా నష్టపోయిందో అంతే వేగంగా పుంజుకుంటుందని భవిష్యవాణి చెప్పారు.  రాష్ట్ర విభజన వలన సీమాంధ్రలో ఆదరణ తగ్గుతుందేమోనని భయపడ్డామని కానీ అలా జరగలేదు కాబట్టి సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఖాయంగా వస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తంచేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles