Modi rallys in congress citadel amethi

Modi rallys in Congress citadel Amethi, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Modi rallys in Congress citadel Amethi

కాంగ్రెస్ కోట అమేథీలో మోదీ పాగా

Posted: 05/05/2014 05:05 PM IST
Modi rallys in congress citadel amethi

అగ్రనేతలు ఒకరు పోటీచేస్తున్న ప్రాంతంలో మరొకరు పోటీ ప్రచారానికి రాగూడదని ఇంతవరకున్న లిఖితపూర్వకంగా లేని ఒక అవగాహనను అధిగమిస్తూ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీచేస్తున్న నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాని వెళ్ళారు.  

అమేథీలో స్మృతి ఇరానీ రాహుల్ గాంధీకి పోటీగా ఎన్నికలలో పార్లమెంటు స్థానానికి భాజపా తరఫున నిలబడ్డారు.   రాహుల్ గాంధీ ఈ స్థానంలో భాజపా అభ్యర్థితో పాటు ఆఆపా అభ్యర్థి కుమార్ విశ్వాస్ తో త్రికోణ పోటీలో ఉన్నారు.

2004 నుంచి రాహుల్ గాంధీకి విజయాన్నందించే స్థానంగా పేరుగాంచిన అమేథీలో ఆమ్ ఆద్మీ పార్టీ ముస్లిం వోటర్ల అభిమానాన్ని చూరగొనటంతో భాజపా విజయం అక్కడ ప్రశ్నార్థకమే అని వినిపిస్తున్న తరుణంలో అక్కడ ప్రచారానికి సాక్షాత్తూ మోదీని దింపటంతో భాజపా కూడా అదే అనుమానంతో ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవటం కోసం ఈరోజు ప్రచారానికి ఆఖరి రోజున తీవ్ర ప్రయత్నం చేస్తోందనిపిస్తోంది.  

12 లోక్ సభ ఎన్నికలలో 10 సార్లు గాంధీ కుటుంబీకులకు అమేథీ గెలుపునందించినా, పోటీని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో అక్కడ ప్రియాంకా వాద్రాను ప్రచారంలోకి తీసుకునివచ్చింది.  

అమేథీ, రాయ్ బరేలీ, సుల్తాన్ పుర్ ప్రాంతాలలోంచి మోదీ సభకు కనీసం రెండు లక్షల మంది జనసమీకరణ చెయ్యాలని భాజపా ప్రయత్నం చేస్తోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమధ్య, కాంగ్రెస్ అగ్ర నాయకులు పోటీ చేస్తున్న చోట భాజపా అగ్రనాయకులు, అలాగే భాజపా అగ్రనాయకులు పోటీచేస్తున్న చోటికి కాంగ్రెస్ పెద్దలు ప్రచారానికి పోకపోవటాన్ని ఎత్తి చూపుతూ, వాళ్ళిద్దరిలో ఏమీ తేడా లేదంటూ విమర్శలకు దిగారు. 

అందుకు జవాబుగా అన్నట్లుగా కూడా అమేథీలో మోదీ ప్రచార సభ ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles